ఔషధాల కుండ.. కొబ్బరి బోండా!


Tue,March 21, 2017 02:01 PM

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బోండాలు శ్రేష్ఠమైనవి. పుష్కలమైన లవణాలు, పోషక విలువలు ఉండే కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ దివ్యౌషధంలా పని చేసే కొబ్బరి బోండాలు ఇప్పుడు నగరంలోని ప్రతి కూడళ్లలో లభిస్తున్నాయి.

కొబ్బరి బోండం శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు అలసట, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లల్లో లవణాలు, పోషక పదార్థాలు, రోగ నిరోధక శక్తి ఆధికంగా ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది. కంటిచూపు మెరుగు పడటమే కాకుండా జ్వరం, జలుబు ఉన్నవారికి టానిక్‌లా పని చేస్తుంది. వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.

కొబ్బరి నీళ్లలో పోషక విలువలు
పొటిషియం, సోడియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాఫర్, సల్ఫర్, క్లోరైడ్‌లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మిగితావి మూత్ర విసర్జనలో ఇబ్బందులు రాకుండా దోహదపడుతాయి. కొబ్బరి నీటిలో ప్రొటీన్ల శాతం ఆవుపాలలో కంటే ఎక్కువగా ఉంటాయి.
లేత కొబ్బరి నీళ్లలో ఆస్కార్బిక్ యాసిడ్, బీ గ్రూప్ విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి.

ప్రయోజనాలు
- శరీరంలో లవణాల శాతాన్ని పెంచుతుంది.
- చిన్న పిల్లలకు మంచి పోషకాహారం
- ఎవరిలోనైనా పోషకాహారలోపాన్ని కొంత మేరకు తగ్గిస్తుంది.
- మూత్రంలో కలుషితాలను శుద్ధి చేసి, విష పదార్థాలను తొలగిస్తుంది.


5495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles