సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Jul 01, 2020 , 14:10:03

పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి

పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. తుమ్మిన, దగ్గిన జనం భయపడుతున్నారు. అయితే అత్యవసర పనులు, ఉద్యోగాల కోసం చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. మరికొంత మంది కరోనా భయంతో నెలకు సరిపడా నిత్యావసరాలు, వారానికి కావాల్సిన కూరగాయలు, పండ్లను తెచ్చుకుంటున్నారు. అయితే కూరగాయలను శుభ్రం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించలంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఉప్పు, పసుపుతో కూరగాయలను 20 నిమిషాలు కడిగితే వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా తొలిగిపోతుంది.

ముందుగా ఉప్పు, పసుపుతో కూరగాయలను కడిగి.. వాటిని మళ్లీ మంచినీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఈ మధ్య కాలంలో చాలా మంది కూరగాయలను సబ్బు, డెటాల్‌, శానిటైజర్లతో శుభ్రం చేయడంతో పాటు తుడిచి అరగంట పాటు ఎండబెడుతున్నారు. కూరగాయలు, పండ్లు శుభ్రపరచడానికి డిటర్జెంట్లు, సబ్బు లాంటి వాటిని వాడకూడదు. ఇవి వాడడం వల్ల పండ్లకు, కూరగాయలకు అట్టుకొన్న సబ్బులు సరిగా శుభ్రం చేకపోతే మరో రకం ఆరోగ్య సమస్యలు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు వైద్య నిపుణులు.


logo