గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Jul 27, 2020 , 18:27:29

పోషకాల పుట్ట.. దాల్చిన చెక్క

పోషకాల పుట్ట.. దాల్చిన చెక్క

మ‌ధుమేహం ఉన్న వారికి దాల్చిన చెక్క ఎంత‌గానో మేలు చేస్తుంది. నిత్యం ఒక స్పూన్ దాల్చిన చెక్క‌ పొడిని తీసుకుంటుంటే మధుమేహం తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గించే గుణాలు కలిగి ఉన్నందున టైప్ 2 మాత్ర‌మే కాదు, టైప్ 1 మధుమేహం ఉన్న వారికి కూడా ఇది మేలు చేస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అంతేకాదు దాల్చిన చెక్క‌తో మ‌రిన్న ప్ర‌యోజ‌నాలున్నాయి. అవేంటో వివ‌రంగా తెలుసుకోండి.  

 * కీళ్ళ నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు దాల్చిన చెక్క‌తో చేసిన టీ తాగ‌డం మంచిది. ఇది ఈ కార‌కాఆల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంద‌ని నిపుణులు వెల్ల‌డించారు. అంతేకాదు దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 

* గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.

* దాల్చిన చెక్క మెదడుకు రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్‌ను నివారించి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ శరీరంలో తిరగకుండా అడ్డుకుంటాయి. 

* దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. 

* దాల్చిన చెక్కలో ఎక్కువగా యాంటీబాక్టీరియల్ గుణాలు ఉన్నందున రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది.

* దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలు, చిగుళ్ళ వ్యాదులు, నోటి పుండ్లను నివారించడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే మౌత్ ఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

* నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే తిమ్మిర్ల‌ను దాల్చిన చెక్క త‌గ్గించ‌డానికి సాయ‌ప‌డుతుంది. 

* విరేచనాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే బ్యాక్టీరియాను చంపేస్తుంది. బాగా జీర్ణం అయి ఆరోగ్యంగా ఉంచుతుంది. 


logo