విటమిన్లు అందించే చూయింగ్‌గమ్..!


Thu,October 11, 2018 01:59 PM

వాషింగ్టన్ : మనం టైంపాస్‌కు తీసుకునే చూయింగ్ గమ్‌తో మెరుగైన ప్రయోజనాలున్నాయంటున్నారు పరిశోధకులు. చూయింగ్ గమ్ నమలడం వల్ల మన శరీరానికి విటమిన్లు అందుతాయని తాజాగా జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తొలిసారిగా చూయింగ్ గమ్ వల్ల కలిగే లాభాలపై పరిశోధనలు జరిపారు.

దీనిపై యూనిర్సిటీ ప్రొఫెసర్ జోషువా లాంబర్ట్ మాట్లాడుతూ..మార్కెట్‌లో లభించే చూయింగ్ గమ్ ఉత్పత్తులపై సుదీర్ఘ పరిశోధన చేశాం. సుమారు 15 మందికి గమ్స్ సంబంధిత ఉత్పత్తులు అందించాం. చూయింగ్ గమ్స్ తీసుకున్న వారిలో సుమారు ఎనిమిది విటమిన్లు ఉత్పాదక స్థాయి పెరిగింది. చూయింగ్ గమ్ తీసుకున్న వారిలో రెటినాల్ (ఏ1 విటమన్), థయమిన్ (బీ1), నియాసిన్ (బీ3), పైరిడాక్సిన్ (బీ6), ఫోలిక్ ఆమ్లం, సయానో కొబాలమిన్ విటమిన్ (బీ12), ఎస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సీ), అల్ఫా-టోకోఫెరాల్ (ఈ విటమిన్) విటమిన్లు శరీరానికి అందినట్లుగా వెల్లడైంది. అంతేకాకుండా 15 మందిలో ప్లేస్‌బో గమ్ తీసుకున్నవారితో పోలిస్తే ఇతర చూయింగ్ గమ్స్ తీసుకున్న వారిలో ప్లాస్మాలో నీటిలో కరిగే విటమిన్లు ఐన (బీ6), సీ విటమిన్ శాతం పెరిగినట్లు వెల్లడైందని వెల్లడించారు.

1710

More News

VIRAL NEWS