మంగళవారం 31 మార్చి 2020
Health - Mar 11, 2020 , 17:53:17

తామర గింజలతో డయాబెటిస్‌కు చెక్

తామర గింజలతో డయాబెటిస్‌కు చెక్

తామర గింజలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ప్రస్తుతం సూపర్‌మార్కెట్లలలో వీటిని పూల్‌మఖనా పేరుతో అమ్ముతున్నారు. చూడడానికి ఇవి పాప్‌కార్న్‌లా ఉంటాయి. వీటిని అలాగే తినేయొచ్చు. లేదా వండుకుని తినొచ్చు. ేదో సరదాకు తినడం కాదు.. వీటివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇంగ్లిష్ లో ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని వీటిని పిలుస్తారు. అద్భుతమైన పోషక విలువల కారణంగా ఇప్పుడు వీటిని సూపర్ ఫుడ్స్ జాబితాలో చేరుస్తున్నారు.

చైనీయులు మూడువేల సంవత్సరాలుగా వీటిని ఔషధంగానూ, వంటకాలలోనూ ఉపయోగిస్తున్నారు. మనదేశంలో అయితే ఉత్తరాదిలో ఉపవాసపు రోజుల్లో వీటిని తింటుంటారు. ఆయుర్వేదంలోనూ వీటిని వాడుతారు. వీటిలో అధిక కెలోరీలు, చెడుకొవ్వులు ఏమాత్రం ఉండవు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇవి నచ్చుతాయి. వీటిలో మంచి కార్బ్‌లు, ప్రొటీన్లు, బి1, బి2, బి3 విటమిన్లు, ఫొలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ మొదలైనవి దండిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్‌లు తగిన మోతాదులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మఖనాలు అద్భుతంగా పనిచేస్తాయి. కనుక మధుమేహులు వీటిని తీసుకుంటే మంచిది. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కుగా ఉంటుంది. అధికరక్తపోటుకు కూడా ఇదే దివ్యౌషధం అని అంటున్నారు.       


logo
>>>>>>