రోజుకో గుడ్డు తింటే..


Mon,June 11, 2018 10:41 PM

రోజుకో గుడ్డు తింటే రొమ్ము క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన అవగాహన కరువైంది. ఈ వ్యాధి నివారణ గురించి పరిశోధకులు ఒక అధ్యయనమే చేపట్టారు. మూడు వేల మంది మహిళలను ఎంచుకొని బి కాంప్లెక్స్, కొలైన్ పదార్థం ఎక్కువగా ఉండే గుడ్లను ఆహారంలో ఇచ్చారు. దీంతో వాళ్లలో కొలైన్ శాతం పెరిగినట్లు గ్రహించారు.

కణాలు సాధారణ రీతిలో పనిచేసేందుకు కొలైన్ చాలా అవసరం. ప్రత్యేకించి పిల్లలను పెంచే మహిళలకు ఈ కొలైన్ చాలా అవసరం. గుడ్డులో 125.5 మి. గ్రా.ల కొలైన్ ఉంటుంది. ఇది రోజూ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ నివారించవచ్చని పరిశోధకులు తేల్చారు. గోధుమ మొలకలు, కాలీఫ్లవర్స్ కూడా తీసుకోచ్చు.

6764
Tags

More News

VIRAL NEWS