సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Aug 07, 2020 , 20:14:24

ఈ ల‌క్ష‌ణాలుంటే జీర్ణ‌స‌మ‌స్య‌లున్న‌ట్లే.. అవేంటో త్వ‌ర‌గా తెలుసుకోండి!

ఈ ల‌క్ష‌ణాలుంటే జీర్ణ‌స‌మ‌స్య‌లున్న‌ట్లే.. అవేంటో త్వ‌ర‌గా తెలుసుకోండి!

క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కి అంద‌రూ ఇంటి నుంచి ప‌నిచేస్తున్నారు. దీనివ‌ల్ల బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, డిన్న‌ర్ టైమింగ్స్ మారాయి. బ‌య‌ట తిరిగే ప‌నులు లేక‌పోవ‌డంతో క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం. ఫ‌లితంగా బ‌రువు పెర‌గ‌డం. ఇది ఒక‌టే అయితే ప‌ర్వాలేదు. దీనికి తోడుగా జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. తినే తిండి స‌రిగా అర‌గ‌క అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొనితెస్తుంది. అయ్యో.. ఎలా అని గాబ‌రా ప‌డ‌కండి. మీరు తినే ఆహారం అరుగుతుందో లేదో, డైజెస్టివ్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇదంతా చ‌ద‌వాల్సిందే..

* టైంకి అన్నం తింటున్న‌ప్ప‌టికీ, ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా హ్యాపీగా ఉన్న‌ప్ప‌టికీ ఏదో పోయిన‌ట్లుగా నీరసంగా అనిపిస్తే ఏదో తేడాకొడుతున్న‌ట్లు భావించాలి. చెత్త ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల ఇది అరుగుద‌ల‌ను దెబ్బ‌తీయ‌డంతోపాటు ఇమ్యూన్ సిస్టంను ప్ర‌భావితం చేస్తుంది. 

* చ‌ర్మం ఎర్ర‌గా కందిపోవ‌డం, మొటిమ‌లు, స్కిన్ ఎల‌ర్జీలు వంటివి ఏవైనా కొత్త‌గా క‌నిపిస్తే ఇవి డైజెస్టివ్ సిస్టంకి సంబంధించివే. ముఖం మీద ఎక్క‌డెక్క‌డ స్పాట్స్ ఉన్నాయో చూసి కూడా ఈ స‌మ‌స్య‌ను చెప్పొచ్చు.

* ఎలాంటి ఇబ్బందులు లేక‌పోయినా ఆందోళ‌న‌, చిరాగ్గా అనిపిస్తే జీర్ణ‌స‌మ‌స్య‌లే. పొట్ట‌కి మెద‌డుకి అవినాబావ సంబంధం ఉంటుంది. పొట్ట‌లోని మంచి బ్యాక్టీరియా మెద‌డు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది గ‌నుక లేక‌పోతే చెడు బ్యాక్టీరియా విర్ర‌వీగుతుంది. 

* ఇమ్యూన్ సిస్టం వీక్ గా ఉంటే రకరకాల ఇన్‌ఫెక్ష‌న్లు దాడి చేస్తాయి. వాటిని ఎదుర్కొనే శక్తి శరీరానికి ఉండదు. దాంతో మెడిసిన్స్ తో ఆ ఇంఫెక్షన్స్ ని బైటికి పంపవలసి వస్తుంది.

* తినింది స‌రిగా అర‌క్క‌పోతే బాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివ‌ల్ల నోరు చెడు వాస‌న రావ‌డంతోపాటు  చేదుగా మారుతుంది. డైజెస్టివ్ సిస్టం సరిగ్గా లేనివారు ఏ విషయం మీదా పూర్తిగా ఫోకస్ పెట్టలేరు. 

* రాత్రంతా హాయిగా నిద్రపోతే పొట్ట బాగున్నట్టే. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మాటిమాటికీ మెలకువ వచ్చేయడం, చెడ్డ కలలూ, కలవరింతలూ లాంటి స‌మ‌స్య‌ల‌న్నీ వెంటాడుతూనే ఉన్నాయి.  


logo