మంగళవారం 14 జూలై 2020
Health - Jun 29, 2020 , 19:34:41

రోజుకో క్యారెట్‌.. ఆరోగ్యానికి ఎంతో మేలు

రోజుకో క్యారెట్‌.. ఆరోగ్యానికి ఎంతో మేలు

క్యారెట్‌ అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. చాలా మంది దీన్ని పచ్చిగానే తినేందుకు ఇష్టపడతారు. కొందరు జ్యూస్‌ చేసుకొని తాగుతారు. క్యారెట్‌ కంటికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కూడా ఎన్నో పోషకాలను అందిస్తుంది. క్యారెట్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్-A కూడా అధికంగానే ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్‌లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది.


అంతే కాదు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును క్యారెట్లో ఉండే పోషకాలు నియంత్రిస్తాయి.  చర్మ సమస్య, జుట్టు పొడిబారుట వంటి సమస్యలు క్యారెట్‌ తింటే తొలగిపోతాయి. రోజు క్యారెట్‌ తినడం వల్ల చిగుళ్లు, పళ్లకు కూడా మంచిదని, బీపీ నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

క్యారెట్‌ తింటే క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చు. క్యారెట్‌లో ఇన్నిలాభాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది తమ ఆహారంలో క్యారెట్‌ను ఎక్కువగా తీసుకుంటారు. వైద్యులు కూడా ఇదే సలహా ఇస్తుంటారు. క్యారెట్‌ను ఒకే విధంగా కాకుండా చాలా రకాలుగా తీసుకోవచ్చు. జ్యూస్‌, స్వీట్‌ ఇలా రకరకాలుగా ట్రై చేయవచ్చు.


logo