శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Jun 09, 2020 , 22:47:32

రోజు వాడే వస్తులతో జాగ్రత్తలు తప్పని సరి

రోజు వాడే వస్తులతో జాగ్రత్తలు తప్పని సరి

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. నివారణ చర్యల ద్వారా మాత్రమే కరోనా మహ్మమారిని నియంత్రించవచ్చు. అన్ని దేశాలు కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా నివారణకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు మనం రోజు వాడే వస్తువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మొబై‌ల్‌ ఫోన్లు, ల్యా‌ప్‌టాప్‌లు, మెటల్‌ వస్తువులు, స్టీల్‌ పాత్రలు, కారు స్టీరింగ్లు, రిమోట్లు, కరెన్సీ నోట్లు, వాష్‌రూమ్స్‌ ఇలా అన్నింటితో జాగ్రత్తలు పాటించాలి. మొబైల్‌ ఫోన్‌ మనిషి జీవితంలో ఒక భాగమైంది.

మన ఫో‌‌న్‌ను వేరే వారు తాకడం ద్వారా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. కాబట్ట మొబైల్‌, ల్యాప్‌టాప్‌లను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. పబ్లిక్‌ వాష్‌రూమ్స్‌ అనేక వ్యాధులకు కారణాలు. వాష్‌రూమ్స్‌లో ఉంటే ట్యాప్‌లను నేరుగా  తాకకుండా టిష్యూ వాడాలి. మెట్‌ల్‌ వస్తులపై కరోనా వైరస్‌ 24 గంటలు ఉంటుంది. కాబట్టి మెటల్‌ వస్తువులను తాకిన వెంటనే శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వైరస్‌ వాప్తిని నియంత్రించేందుకు వీలుంటుంది. కారు స్టీరింగ్‌, సీటింగ్‌ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. కారు, బస్సు, ఆటోళ్లో ప్రయాణం చేసే సమయంలో తప్పని సరిగా మాస్కులు ధరించాలి.

ప్రయాణం అనంతరం కాళ్లు, చేతులు, ముఖాన్నిసబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. లేదా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉండే స్టీల్‌ పాత్రలను చాలా మంది వాడుతుంటారు. వీటి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక టీవీ రిమోట్స్‌, కరెన్సీ నోట్లు ఇలాంటి వాడిన తర్వాతా శానిటైజర్‌, సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. చిన్న చిన్నజాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.


logo