e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఆరోగ్యం మన దేశంలో క్యాన్సర్‌ మరణాలది రెండో స్థానం

మన దేశంలో క్యాన్సర్‌ మరణాలది రెండో స్థానం

మన దేశంలో క్యాన్సర్‌ మరణాలది రెండో స్థానం

వైద్యరంగంలో క్యాన్సర్‌ను కనుగొనటానికి, చికిత్స అందించడానికి ఎన్నో ఆధునికమైన, విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నా, క్యాన్సర్‌ ఇంకా మానవాళికి ఒక పెను సవాలుగానే నిలిచిందనడానికి నిదర్శనం.. పెరుగుతున్న క్యాన్సర్‌ మరణాల సంఖ్య. మన దేశంలో మరణాల సంఖ్యలో క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. దశాబ్దకాలంలో గమనిస్తే క్యాన్సర్‌కు గురై మరణిస్తున్న వారి సంఖ్య రెండింతలు అయ్యిందని చెప్పుకోవచ్చు. మన దేశంలో పిల్లల్లో క్యాన్సర్స్‌ పెద్దవారితో పోలిస్తే 8శాతం వరకూ ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు 45 వేల మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో 70శాతం మందికి పూర్తిగా నయమైనా, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తిరగబెట్టే ప్రమాదం ఉంది. పిల్లల్లో రక్తసంబంధిత క్యాన్సర్స్‌ (లుకేమియా), మెదడులో వచ్చే కణితులు (బ్రెయిన్‌ ట్యూమర్స్‌) లింఫోమా, సాఫ్ట్‌ టిష్యూ సర్‌కోమా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ముందుగా ఎటువంటి సంకేతాలు లేకుండానే సడెన్‌గా జ్వరం, అలసట, బరువు తగ్గటం వంటి లక్షణాలు వీరిలో బయటపడవచ్చు. మన దేశంలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో అగ్రభాగాన ఉండేది.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తీరప్రాంతాల్లో నివసించే వారిలో ఈ క్యాన్సర్‌ ఎక్కువ. పెళ్లికాక ముందే అమ్మాయిలు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ మూడు డోసులు తీసుకుంటే ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు. కానీ అప్పటికే పెళ్లి అయి ఉంటే, పాప్‌ స్మియర్‌ అనే పరీక్ష ద్వారా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని చాలా ముందుగా పసిగట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు.

మనదేశంలో స్త్రీలు.. లేటు దశలో గుర్తించటం వల్లనో, లక్షణాలు కన్పించినా నిర్లక్ష్యం చేయటం వల్లనో వ్యాధి నయం చేయలేని దశకు చేరుకుంటారు. కానీ, ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయటం తేలికే అని చెప్పుకోవచ్చు.

 1. వ్జైనా నుంచి అసాధారణంగా ఉండే స్రావాలు 2. నెలసరి మధ్యలో లేక కలయిక అప్పుడు నొప్పి, రక్తస్రావం
 2. నెలసరి రక్తస్రావం ముందు కంటే ఎక్కువ అవ్వటం.
 3. ఆకలి, బరువు తగ్గటం, అలసట, ఇంకా.. క్యాన్సర్‌ దశను బట్టి నడుం నొప్పి, ఎముకల నొప్పులు, కాళ్లవాపు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. పాప్‌స్మియర్‌, కాల్పోస్కోపి, బయాప్సి వంటి పద్ధతులతో ఈ క్యాన్సర్‌ను గుర్తించి హిస్టెరోస్కోపి, ఊపరెక్టమి వంటి సర్జరీలు చేస్తారు. వయసు పై బడిన స్త్రీలలో అయినా, పురుషుల్లో అయినా క్యాన్సర్‌కు గురయ్యే రేటు కూడా ఎక్కువ అవుతున్నది. స్త్రీలలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం వయసు పై బడే కొద్ది చాలా ఎక్కువ అవుతుంది. అవివాహిత స్త్రీలు, పిల్లలు కలుగని స్త్రీలు, పాలు ఇవ్వకపోవడం, పదేండ్ల లోపు రజస్వల అయి 55 ఏండ్లు అయినా మెనోపాజ్‌కు చేరుకోకపోవడం, దీర్ఘకాలం పాటు హార్మోన్ల మీద ప్రభావం చూపించే మందులు వాడటం వల్ల రక్తసంబంధికుల్లో ఈ క్యాన్సర్‌ ఎక్కువ. అంతేగాక స్మోకింగ్‌, ఆల్కహాల్‌ వంటి దురలవాట్లు ఉన్న వారికి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతూ ఉంటుంది.
 4. రొమ్ములో కదలని గట్టి గడ్డ తగలటం. 2 రొమ్ముల్లో లేక చంకల్లో గడ్డ లేక వాపు కనిపించటం 3. చనుమొన సైజులో మార్పు, లోపలికి తిరిగి ఉండటం. 4 రొమ్ము పైభాగాన ఎంతకూ నయం కాని పుండు 5. రొమ్ము మీద చర్మం మందం కావటం, సొట్ట పడటం, నారింజ తోలు లాగా గుంటలు పడటం. 6. బ్రెస్ట్‌ సైజులో మార్పులతో పాటు చనుమొన నుంచి రక్తస్రావం అవటం ..ఇటువంటి లక్షణాలు కనిపించే సరికే క్యాన్సర్‌ తొలిదశను దాటిపోయే ప్రమాదం ఉంది. 20 ఏండ్లనుంచే రొమ్ము క్యాన్సర్‌ పట్ల అవగాహనతో స్వయంగా సబ్బువేళ్లతో.. నెలసరి అయిన ఏడవ రోజున పరీక్షించుకోవటం, 20ఏండ్లు పై బడ్డాక అల్ట్రాసౌండ్‌, మామోగ్రామ్‌, అవసరమైతే బయాప్సీ వంటి పరీక్షలతో క్యాన్సర్‌ను గుర్తించినా.. బ్రెస్ట్‌, లంప్‌సైజ్‌ను, దశను బట్టి గడ్డను మాత్రమే తీసివేసే లంపెక్టమి లేదా మొత్తంగా తీసివేసే మాస్టెస్టమి చేస్తారు. స్త్రీలలో రొమ్ము సంబంధిత, గర్భాశయ ముఖ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్‌, పురుషుల్లో ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన లివర్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో హెపటైటిస్‌ బి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కాబట్టి , దీర్ఘ కాలంలో ఈ వైరస్‌ వల్ల లివర్‌ క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ పెరుగుతుంది. అందుకే, అందరూ హెపటైటిస్‌ బి వైరస్‌ వ్యాక్సిన్‌ చిన్న వయసులోనే మూడు డోసులు వేయించుకొంటే మంచిది.
- Advertisement -

1.కడుపులో నొప్పి 2. ఆకలి, బరువు తగ్గటం. 3. కామెర్లు, వాంతులు, 4. పొట్టలో నీరు చేరటం వంటి లక్షణాలు క్యాన్సర్‌ తీవ్రతను తెలుపుతాయి. హెపటైటిస్‌-బి ఉన్నవారు తరచూ స్క్రీనింగ్‌ టెస్టులు చేయించుకుంటే మంచిది. తల్లికి హెపటైటిస్‌-బి ఉంటే పుట్టిన వెంటనే బిడ్డకు, 12 గంటల లోపు హెపటైటిస్‌ ఇమ్యునోగ్లోబులిన్‌ ఇంజక్షన్‌ వేయించటం వల్ల వారు హెపటైటిస్‌ వైరస్‌ బారిన పడకుండా ఉంటారు.
ఒకప్పుడు పురుషుల్లో ఎక్కువగా కనిపించిన ఊపరితిత్తుల క్యాన్సర్‌ స్త్రీలలో స్మోకింగ్‌, ఆల్కహాల్‌ రేటు పెరగటం వల్ల వారిలో కూడా ఎక్కువగానే కనిపిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో ఊపిరితిత్తల క్యాన్సర్‌ మరణాలే అధికం. అభివృద్ధి చెందని దేశాలకంటే చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్‌ ఎక్కువ. టుబాకో ఉత్పత్తులు, బీడీ, చుట్ట, గుట్కా, పొగాకు నమలడం, సిగరెట్‌ వంటి అలవాట్లు, వారికే కాకుండా వారి పక్కనున్న వారికీ ఈ ముప్పును కొనితెచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ బాధితులలో స్మోకింగ్‌ చేసే వారే అధికంగా ఉంటారు.

 1. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం.
 2. బాగా దగ్గు, దగ్గుతో పాటు రక్తం.
 3. ఆకలి, బరువు తగ్గటం.
 4. ఛాతీలో, పొట్టలో నొప్పి.
 5. మింగటం కష్టంగా ఉండటం.. మొదలైన లక్షణాలతో బయటపడే క్యాన్సర్‌కు ఇతర అవయవాలకు త్వరగా వ్యాప్తి చెందే గుణం ఎక్కువ. చెస్ట్‌ ఎక్స్‌రే, బయాప్సీ, సీటీస్కాన్‌, యంఆర్‌ఐ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారించి, స్పైరోమెట్రి, బ్రాంకోస్కోపి, రక్త పరీక్షలతో కణితి ఎక్కడ, ఏ దశలో ఉంది అనే విషయాలను నిర్ధారించి అవసరమైతే లంగ్‌లో కొంత భాగాన్ని తీసివేసే లోబెక్టమి, అదీ కుదరకపోతే కీమోథెరఫీ ఇస్తారు.
  మసాలాలు, బియ్యం, కారం ఎక్కువగా తినటమే దీనికి అసలు కారణాలు. కచ్చితంగా తెలియవు కానీ, దక్షిణ భారతదేశంలో పురుషుల్లో స్టమక్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తున్నది. అల్సర్స్‌ లక్షణాల్లానే కనిపించే ఈ క్యాన్సర్‌ లక్షణాలను అల్సర్స్‌గా పొరబడే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి జీర్ణాశయ అల్సర్స్‌ క్యాన్సర్‌కు దారితీయొచ్చు.
 6. కడుపులో నొప్పి, ఎసిడిటీ
 7. ఆకలి, బరువు తగ్గటం
 8. వికారం, ఎక్కిళ్లు, త్రేన్పులు
 9. రక్తపు వాంతులు, మలంలో నల్లగా రక్తం పడటం.. వంటి లక్షణాలు క్యాన్సర్‌లో కనిపిస్తాయి. ఎండోస్కోపి, బయాప్సీ అవసరమైతే సీటీ స్కాన్‌, యంఆర్‌ఐ, వంటి పరీక్షలతో క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. కణితి చిన్నగా ఉండి, వాటి పొట్ట్టలో కొంత భాగాన్ని తీసి వేసే గ్యాస్ట్రెక్టమి, కణితి పెద్దగా ఉండి చుట్టూ ఉన్న టిష్యూలకు, లింఫ్‌నోడ్స్‌లకు పాకితే పొట్టమొత్తాన్ని, అన్న వాహికలతో కొంతభాగాన్ని, చిన్న పేవులలో కొంతభాగాన్ని తీసివేసి, మిగిలిన అన్నవాహికను చిన్న పేగులతో కలిపి కుట్టివేస్తారు. కానీ తర్వాత, ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

డాక్టర్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌
హైదరాబాద్‌: 9848011421
కర్నూల్‌: 08518-273001
గుంటూర్‌: 0863-2223300

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మన దేశంలో క్యాన్సర్‌ మరణాలది రెండో స్థానం
మన దేశంలో క్యాన్సర్‌ మరణాలది రెండో స్థానం
మన దేశంలో క్యాన్సర్‌ మరణాలది రెండో స్థానం

ట్రెండింగ్‌

Advertisement