సోమవారం 30 మార్చి 2020
Health - Mar 13, 2020 , 18:48:22

అతిగా అలసిపోతున్నారా... జాగ్రత్త..!

అతిగా అలసిపోతున్నారా... జాగ్రత్త..!

ప్రతి చిన్నపనికీ అలసిపోతుంటే వయసుపెరుగుతోంది కదా అనుకుంటూ ఉంటారు. కాని కొన్నిసార్లు ఇది సాధారణ బలహీనత కాకపోవచ్చు. శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలసటతో పాటు మందకొడితనం, కండరాల నొప్పులు కూడా ఉంటాయి. రక్తహీనత కూడా ఈ స్థితికి కారణమే. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శ్వాసకోశాల శక్తి తగ్గిపోతుంది. ఆక్సిజన్‌ శరీరంలోని జీవక్రియలన్నింటికీ ప్రేరకంగా ఉంటుంది. అందుకే శరీరంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గడం అంటే శరీరంలోని అవయవాలన్నీ కుంటుపడటమే. ఆలోచన స్థాయి పడిపోవడం ఇందులో అన్నింటికన్నా ప్రధాన సమస్య. వ్యాయామ లోపాలే ఈ సమస్యకు ప్రధాన కారణం. 

చిరాకు వెనుక..

అసహనం కూడా అనారోగ్యాన్ని సూచించే ప్రధాన లక్షణం. తరచూ కోపం రావడం, ఏ పని మీదా ఆసక్తి లేకపోవడంతో పాటు శక్తి హీనతగా కూడా ఉంటుంది. ప్రతి చిన్న పనీ ఎంతో భారంగా అనిపిస్తుంది. శరీరంలో ఏ వ్యాధి మొదలైనా మొదట రక్తకణాలను దెబ్బతీస్తుంది. హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కుంటుపడుతుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్‌ కూడా తగ్గిపోతుంది. దీని ఫలితంగా వచ్చేదే అసహనం. అందుకే అసహనాన్ని కూడా కొన్నిసార్లు చిన్న విషయంగా పరిగణించకూడదు. 


logo