బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 19, 2020 , 16:34:24

కండ్లద్దాలతో కరోనాను జయించొచ్చా?

కండ్లద్దాలతో కరోనాను జయించొచ్చా?

బీజింగ్ : కరోనా వైరస్ సోకడం నుంచి కండ్లద్దాలు రక్షిస్తాయా? అవుననే అంటున్నాయి చైనీస్ అధ్యయనాలు. కంటి అద్దాలు ధరించేవారికి కరోనా వైరస్ ప్రమాదం తక్కువగా ఉంటుందని చైనీస్ అధ్యయనాలు తేల్చాయి. అలాంటి వారు చాలా తక్కువ సంఖ్యలో దవాఖానల్లో చేరుతారని వెల్లడిస్తున్నారు.

చైనాలోని కొవిడ్-19 రోగుల డేటాను పరిశీలిస్తున్న పరిశోధకులు ఒక వింత విషయం కనుగొన్నారు. రెగ్యులర్ కండ్లద్దాలు ధరించే రోగులు చాలా తక్కువ మంది కొవిడ్-19 కు గురయ్యారని పరిశోధకురాలు తారా పార్కర్ పోప్ కనుగొన్నారు. చైనాలో 47 రోజుల వ్యవధిలో 276 మంది రోగులు దవాఖానలో చేరగా 16 మందికి మాత్రమే మయోపియా, సుదూర దృష్టి సమస్యలు వచ్చాయి. ఈ కంటి సమస్యలతో పోరాడుతున్న వ్యక్తి రోజుకు 8 గంటలకు పైగా అద్దాలు ధరిస్తారు. దగ్గు, తుమ్ము నుంచి విడుదలయ్యే బిందువులకు కళ్ళజోళ్ళు అవరోధంగా పనిచేస్తాయి. అలాగే అద్దాలు ధరించే వ్యక్తులు తమ మురికి చేతులతో కళ్ళను తక్కువగా తాకుతారు. కంటి రక్షణ కోసం ధరించే వస్తువులు, ముసుగులు, భౌతిక దూరం కంటే ఎక్కువ రక్షణను ఇస్తాయో లేదో ఇంకా పరీక్షించబడలేదని డాక్టర్ లిసా చెప్పారు. 

వైరస్, ఇతర సూక్ష్మక్రిములు కన్ను, ముక్కు, నోటి యొక్క ముఖ శ్లేష్మ పొరల ద్వారా శరీరానికి చేరుతాయి. కానీ, ముక్కు కరోనా వైరస్ ప్రవేశానికి ప్రధాన మార్గంగా భావిస్తారు. కండ్లకలక  వంటి లక్షణాలతో రోగులు తక్కువ మంది కనిపించారు. ఇలాంటి వారిలో వైరస్ కళ్ళ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చని ఇది సూచిస్తుంది. గత నెలలో వుహాన్ పరిశోధకులు కొవిడ్ 19 కు గురైన 216 మంది రోగులను అధ్యయనం చేశారు. వీరిలో నుంచి 49 మంది పిల్లలు కండ్లకలక సమస్య, కంటిని రుద్దడం వంటి కంటికి సంబంధించిన బహుళ లక్షణాలను ఎదుర్కొంటున్నారు. చైనీయుల్లో ఎక్కువ మంది కండ్లద్దాలు ధరించడం కూడా సహజమే అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగానే జరిగిందని కొందరు కొట్టిపారేస్తున్నారు. 


logo