శుక్రవారం 05 జూన్ 2020
Health - Apr 04, 2020 , 10:20:07

చ‌ల్ల‌ని నీటితో టాబ్లెట్ వేసుకుంటే న‌ష్ట‌మే...!

చ‌ల్ల‌ని నీటితో టాబ్లెట్ వేసుకుంటే న‌ష్ట‌మే...!

ట్యాబ్లెట్లు వేసుకునేందుకు చ‌ల్ల‌ని నీరు ఉప‌యోగిస్తున్నారా? అయితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే! ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా బీపీ, షుగ‌ర్‌, ఒబిసిటీ అంటూ వారికి ఉన్న రోగాల‌తోనే ప‌రిచ‌యం మొద‌లువుతుంది. చిన్న స‌మ‌స్య వ‌చ్చినా హాస్పిట‌ల్ వెళ్లి వైద్యుడిని సంప్ర‌దిస్తారు. ఇంజెక్ష‌న్ వేస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంద‌ని స‌ల‌హా ఇచ్చినా వ‌ద్దు మందులు రాసివ్వ‌మ‌ని అడిగి మ‌రీ ఇంటికి తెచ్చుకుంటారు. డాక్ట‌ర్ చెప్పిన టైంకి స‌రైన మందులు వేసుకుంటారు కానీ, ఈ ఒక్క ప‌ద్ధ‌తి మాత్రం పాటించ‌రు. అదే టాబ్లెట్ వేసుకున్న త‌ర్వాత గోరువెచ్చ‌ని నీరు తాగ‌డం.

ఏం జ‌రుగుతుంది :

సాధార‌ణంగా హోమియోప‌తి మందుల‌కు నీటిని తాగ‌న‌వ‌స‌రం లేదు. కాక‌పోతే.. అలోప‌తి వంటి మందులు వేసుకున్న‌ముందు అయినా త‌ర్వాత అయినా ఖ‌చ్చితంగా నీరు తాగాల్సిందే.. కొంత‌మంది దీనిని నెగ్ల‌ట్ చేస్తుంటారు. సాధార‌ణంగా ట్యాబ్లెట్లు వేసుకున్న త‌ర్వాత చ‌ల్ల‌ని నీరు తాగుతారు. దీంతో మెడిసిన్ ప్ర‌భావం త‌గ్గుతుంది. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. చల్లని నీటితో ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు అవి సరిగ్గా నీటిలో కరగవు.. దీంతో బాడీ ఆ ట్యాబ్లెట్స్‌లో ఉండే మందుని శోషించుకోలేదు. దీంతో రోగం త‌గ్గ‌దు. చ‌ల్ల‌ని నీరు తాగిన‌ప్పుడు ఆ నీరు కాస్త క‌డుపులోకి వెళ్తాయి. ఆ నీటిని వేడిగా మార్చేందుకు శ‌రీరంలో కొంత శ‌క్తి ఖ‌ర్చ‌వుతుంది. ఆ త‌ర్వాత ట్యాబ్లెట్ క‌ర‌గ‌డం మొద‌ల‌వుతుంది. ఎప్పుడైనా మందులు వేసుకోవాలంటే గోరువెచ్చ‌ని నీరు లేదా గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉన్న నీటితో తాగాలి. ఆయుర్వేదంలో ఎన్నో మందులు, టానిక్‌లు గోరు వెచ్చని నీటితో మాత్రమే తాగాలని సూచిస్తారు వైద్యులు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నవారవుతారు. 


logo