గురువారం 26 నవంబర్ 2020
Health - Oct 31, 2020 , 18:02:20

మధుమేహులు అరటి పండు తినొచ్చా...?

మధుమేహులు అరటి పండు తినొచ్చా...?

హైదరాబాద్ : డయాబెటిస్ లేదా మధుమేహం అనగానే చాలామంది ఆహారం గురించి ఆందోళనకు గురవుతారు. ఇది తినొద్దు అది తాగొద్దు అనే నియంత్రణలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. ముఖ్యంగా అరటి, ద్రాక్ష పండ్ల విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అవి తియ్యగా ఉంటాయి కనుక మధుమేహులు తినరాదంటారు. డయాబెటిస్ ఉన్నవారు అప్పుడప్పుడు ఒకటిరెండు ద్రాక్షలను నోట్లో వేసుకుంటారేమోగానీ అరటిని మాత్రం దరిజేరనియ్యరు. అరటిపండు తినగానే ఏదో అరిష్టం జరుగుతుందన్నట్టు వణికిపోతారు. కానీ అరటిపండు తింటూ కూడా రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.