శరీరంలో కాల్షియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?


Mon,December 10, 2018 01:36 PM

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి. మన శరీరంలో 99 శాతం వరకు కాల్షియం ఎముకలు, దంతాల్లో నిల్వ అయి ఉంటుంది. దీంతో శరీర నిర్మాణ క్రియలు సజావుగా సాగుతాయి. ఇక శరీరంలో మిగిలి ఉండే కాల్షియం కండరాల పనితీరుకు, రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలకు, నాడీ మండల వ్యవస్థకు శరీరం సందేశాలను పంపేందుకు పనికొస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది కాల్షియం లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక అనారోగ్యాల బారిన వారు పడుతున్నారు.

కాల్షియం లోపిస్తే..?


శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే చేతి వేళ్లు పట్టును కోల్పోతుంటాయి. వేళ్లల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. కండరాలు పట్టుకుంటాయి. ఆకలి తగ్గుతుంది. చేతి వేళ్ల గోర్లు పగిలిపోతాయి. ఘన, ద్రవ పదార్థాలను మింగడం కష్టతరమవుతుంది. శక్తి లేనట్లుగా నిస్సత్తువగా అనిపిస్తుంది. కొన్ని సార్లు స్పృహ తప్పిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఏకాగ్రత కోల్పోవడం, విసుగు చెందుతుండడం, దంత క్షయం, రక్తం గడ్డ కట్టడం, కీళ్ల నొప్పులు, చిన్నపిల్లల్లో పెరుగుదల ఆగిపోవడం, పెద్దల్లో గుండె సమస్యలు వస్తాయి.

ఎవరికి రిస్క్ ఉంటుంది ?


యుక్త వయస్సులో ఉన్న బాలురు, బాలికలు, మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలు లేదా 50 ఏళ్ల పైబడిన స్త్రీలు, 70 ఏళ్లు దాటిన పురుషులు, శాకాహారులు, పాలు, పాల సంబంధ పదార్థాలను తక్కువగా లేదా అస్సలు తీసుకోని వారిలో కాల్షియం లోపిస్తుంటుంది. అలాగే పలు రకాల మెడిసిన్లను తీసుకునేవారిలో, జన్యు సంబంధ కారణాలు, హార్మోన్ సమస్యలు, విటమిన్ డి, కె2, మెగ్నిషియం తగినంత లేకపోవడం.. వంటి కారణాల వల్ల కూడా కాల్షియం లోపం సమస్య వస్తుంది.

కాల్షియం లోపం పోవాలంటే...


కాల్షియం లోపం సమస్యను అధిగమించాలంటే.. నిత్యం తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేయాలి. నిత్యం ఆహారంలో పాలకూర, క్యాబేజీ, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, బాదం పప్పు, కాలిఫ్లవర్, చేపలు, చికెన్ తదితర పదార్థాలు ఉండేలా చూసుకుంటే కాల్షియం లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.

5005

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles