ఆదివారం 07 జూన్ 2020
Health - Mar 28, 2020 , 20:54:07

కాల్షియం లోపం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలివే..

కాల్షియం లోపం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలివే..

ఈ మధ్యకాలంలో చాలామంది కాల్షియంలేమితో బాధపడుతున్నారు. అయితే, సమస్య వచ్చాక ఇబ్బందిపడే బదులు రాకముందే కొన్ని లక్షణాల ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించొచ్చు. శరీరంలోని ఎముకలు, దంతాలు, గుండె ఇలా ప్రతి అవయవానికి కాల్షియం అవసరముంటుంది. కాల్షియం సరిగ్గా ఉంటేనే ఎముకలు దృఢంగా ఉంటాయి. అన్ని జీవక్రియలకు కాల్షియం ఎంతో ముఖ్యం. సమస్యలను ముందుగానే గుర్తించి దానికి తగినట్లుగా చికిత్స తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యను అధిగమించొచ్చు.

  • కాలు, చేతి నరాలు లాగడం, కాళ్ళనొప్పులు, చేతులు నొప్పులు ఎక్కువగా ఉంటే సమస్యను ఈజీగా గుర్తించొచ్చు.
  • కాల్షియం లోపంతో బాధపడేవారి గోర్లు చిట్లుతుంటాయి.
  • గుండెకొట్టుకునే వేగంలో మార్పు ఉంటే కాల్షియం లోపంగా గుర్తించొచ్చు.
  • త్వరగా బరువుతగ్గినా.. అధికబరువు తగ్గినా కాల్షియం లోపం ఉన్నట్లు భావించొచ్చు.
  • కాలిపిక్కలు పట్టేయడం, కూర్చుని వెంటనే లేవలేకపోవడం ఉంటే కాల్షియం సమస్య అని గుర్తించొచ్చు.


logo