శరీర మెటబాలిజం పెంచుకోవాలంటే..?


Tue,October 16, 2018 12:07 PM

ఒక వ్యక్తి శరీరం నిర్దిష్ట సమయంలో ఎన్ని క్యాలరీలను ఖర్చు చేస్తుందో ఆ రేటునే మెటబాలిజం అంటారు. అంటే.. మెటబాలిజం ఎక్కువగా ఉంటే క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయన్నమాట. అలాంటప్పుడే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే మన శరీర మెటబాలిజాన్ని ఎలా పెంచుకోవచ్చో, అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మనం నిత్యం తీసుకునే ఆహారాన్ని రోజుకు ఒకే సమయానికి తీసుకోవాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఒక రోజు ఏదైతే సమయానికి చేస్తారో అదే సమయాలకు రోజూ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

2. చాలా మంది ఉదయం అల్పాహారం తినడం మానేస్తారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే ఉదయం అల్పాహారం మానేయడం వల్ల రోజులో మిగిలిన సమయాల్లో అతిగా భోజనం చేస్తారని పరిశోధనల్లో వెల్లడైంది. కనుక కచ్చితంగా ఉదయం అల్పాహారం తీసుకోవాలి. ఇక ఒక మహిళకు సగటును రోజుకు 1600 నుంచి 2400 క్యాలరీల శక్తి అవసరమైతే పురుషుడికి 2వేల నుంచి 3వేల క్యాలరీ శక్తి అవసరం అవుతుంది. కనుక క్యాలరీలు అవసరం ఉన్నంత మేర ఆహారం తీసుకోవాలి. అంతకు తక్కువగా తినరాదు. క్యాలరీల మోతాదు చూసుకుని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

3. నిత్యం 1-2 కప్పుల గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే శరీర మెటబాలిజాన్ని పెంచుకోవచ్చు. దీని వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు కూడా.

4. స్ట్రెంగ్త్, రెసిస్టెన్స్ ట్రెయినింగ్ తీసుకుంటే మన శరీర మెటబాలిజం బాగా పెరుగుతుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

5. మన శరీర మెటబాలిజం సరిగ్గా ఉండాలంటే నిత్యం తగినంత మోతాదులో నీటిని కూడా తాగాల్సి ఉంటుంది. నీటి వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది.

6. ఆందోళన తగ్గించుకోవడం, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేయడం, వేళకు తగినంత నిద్ర పోవడంతోపాటు బి విటమిన్లు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. అరటి పండ్లు, ఆలుగడ్డలు, కోడిగుడ్లు, ఆరెంజ్ జ్యూస్, పీనట్ బటర్, పల్లీలు, పచ్చి బఠానీలు, పాలకూర, తృణ ధాన్యాలను తీసుకుంటే మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.

2867

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles