ఇనుములాంటి ఒంటి కోసం మినుములు


Sun,April 7, 2019 07:59 AM

మినుములు తింటే ఇనుము అంత బలం అన్నది మన వాడుక. దీనిలోని పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయని వైద్యులు అంటున్నారు. దాంతో రకరకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. వంద గ్రాముల మినుముల్లో 18గ్రాముల పీచు(ఫైబర్)ఉంటుంది. ఒక గ్రాము పొటాషియం, రెండు గ్రాముల కొవ్వుతో పాటు విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1,బీ3 వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్ కూడా ఎక్కువే. మినుములతో ఒనగూరే మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలైన వారికి అవి త్వరగా తగ్గడానికి మినుములు మంచిఆహారం. ఇక మినుముల్లో దాదాపు 72 శాతం ఫీచు ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

అంతే కాక మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, వంటి సమస్యలను స్వాభావికంగానే తొలగిస్తాయి. అంతేకాదు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడామందులకు బదులు మినుములతో చేసిన వంటకాలను తినవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. గుండె జబ్బులను నివారించే అద్బుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణం. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణం కూడా మినుములకు ఉంది. స్వాభావికమైన పీచు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస్య ఉన్న వారికి మినుములు మంచి ఆహారం మినుములను ఏ కాలంలో అయినా తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు.

5919

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles