వ‌డ‌గాలి ప్రాణాంత‌కం కావ‌చ్చు..


Fri,May 26, 2017 03:06 PM

రోజురోజుకూ ఎండ‌లు మండిపోతున్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త 50 డిగ్రీల‌ను దాటింది. ఉద‌యం 9 గంట‌ల నుంచే వ‌డ‌గాలుల ప్ర‌భావం ఉంటున్న‌ది. ఎండ‌ల వ‌ల్ల పిల్ల‌లు, వృద్ధులు ఎక్కువ‌గా వ‌డ‌దెబ్బ‌కు గుర‌వుతున్నారు. వడ‌గాలి ప్రాణాంత‌కం కావ‌చ్చ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ అథారిటీ సైతం ధృవీక‌రించింది. వడ‌దెబ్బ త‌గ‌ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని హెచ్చ‌రిస్తున్న‌ది.

వడ‌దెబ్బ త‌గ‌ల‌కుండా తీసుకోవ‌లిసిన జాగ్ర‌త్త‌లు
1. ద‌ప్పిక వేసినా వేయ‌క పోయినా త‌ర‌చూ నీరు తాగుతుండాలి. నోరు ఆరిపోకుండా చూసుకోవాలి.
2. ఎక్కువ‌గా ద్ర‌వ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. ల‌స్సీ, మ‌జ్జిగ‌, నిమ్మ‌ర‌సం, అంబ‌లి వంటి ఇంట్లో త‌యారు చేసిన (ఓర‌ల్ హైడ్రేష‌న్ సొల్యూష‌న్‌)వి తీసుకోవాలి.
3. తేలికైన‌, లేత రంగు కాట‌న్ దుస్తుల‌ను ధ‌రించ‌డం మంచిది.
4 . బ‌య‌టికి వెళ్లేట‌పుడు త‌లకు తెల్ల‌ని గుడ్డ గానీ, టోపీ గానీ, గొడుగును గానీ తీసుకెళ్లాలి.
5. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని నీడ‌లోనే ఉంచి అందుబాటులో నీరు ఉండేలా చూడాలి.
6. ఆగి ఉన్న వాహ‌నాల వ‌ద్ద పిల్ల‌ల‌ను, వృద్ధుల‌ను ఉండ‌నీయొద్దు. వాహ‌నాలు వేడి గాలుల ప్ర‌భావంతో ఉంటాయి.
7. ద్విచ‌క్ర వాహ‌నాల‌పై ప్ర‌యాణించే వారు త‌ల‌కు హెల్మెట్ లేదా ముఖం క‌వ‌ర్ అయ్యేట‌ట్లు త‌ల‌కు తెల్ల‌ని గుడ్డ‌ను క‌ట్టుకోవాలి. ఎక్కువ దూరం వెళ్లే వారు మ‌ధ్య మ‌ధ్య‌లో నీడ పాటున ఆగి నీళ్లు తాగాలి. ఒకేసారి ఎక్కువ‌గా కాకుండా ఎక్క‌వ‌సార్లు త‌గినంత నీరు తాగితే మంచిది.

2690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles