శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 21, 2020 , 13:48:56

ఆక‌లి లేక‌పోయినా తింటున్నారా?

ఆక‌లి లేక‌పోయినా తింటున్నారా?

అస‌లే లాక్‌డౌన్‌. బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి కుద‌ర‌దు. ఇంట్లోనే కూర్చుంటాం. ఖాళీగా కూర్చోవ‌డం వ‌ల్ల కుడుపు కామ్‌గా ఉండ‌దు. కంటికి క‌నిపించిన‌దాన్ని ల‌టుక్కున క‌డుపులోకి పంపిచేస్తాం. దీంతో ఆ స‌మ‌యానికి నోటికి ప‌నిపెట్ట‌డ‌మే గాని, జ‌ర‌గ‌బోయే అన‌ర్థాలు మాత్రం ప‌సిగ‌ట్ట‌లేం. అస‌లు విష‌యం ఏంటంటే.. ఆక‌లిగా ఉన్న‌ప్పుడు ఆహారం తీసుకోవ‌డంలో ఎలాంటి త‌ప్పులేదు.  ఆక‌లి లేక‌పోయినా స‌ర‌దాగా తినడం, ఎవరైనా బలవంతం చేస్తే మొహమాటానికి తింటే మాత్రం రాబోవు అనారోగ్యాల‌ను స్వాగ‌తించ‌డం త‌ప్ప మ‌రోప‌ని ఉండ‌దు. ఇలా మాటిమాటికి తిన‌డం వ‌ల్ల  అనారోగ్యం కలిగిస్తుందని అమెరికాలోని ఇల్లినాయిస్ లోని డేవిడ్ గాల్ ఆఫ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనల వివరాలను అసోసియేషన్ ఆప్ కన్స్యూమర్ రీసెర్చ్ అనే జర్నల్ లో ప్రచురించింది. ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ స్థాయులను పరిశీలిస్తూ వీరు పలు పరిశోధనలు నిర్వహించినట్టు జర్నల్ పేర్కొంది. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం సంక్రమిస్తుందని, ఆకలి లేనప్పుడు సరదాగా తినే తిండి అనారోగ్యంపాలు చేస్తుందని వీరి పరిశోధనల ద్వారా వెల్లడైందని జర్నల్ తెలిపింది. 


logo