గ్రీన్ టీని ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా..?


Tue,August 21, 2018 09:43 AM

గ్రీన్ టీ తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ వల్ల అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మనకు గ్రీన్ టీ తాగడం వల్ల కలుగుతాయి. అయితే గ్రీన్ టీని రోజులో ఏ సమయంలో తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలోనూ గ్రీన్ టీని తాగవచ్చు. ఈ రెండు సమయాల్లో గ్రీన్ టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రీన్ టీని ఉదయాన్నే ఖాళీ కడుపుతో అస్సలు తాగరాదు. అలా తాగితే లివర్‌పై గ్రీన్ టీ హానికర ప్రభావాన్ని చూపిస్తుంది.

రక్తహీనత సమస్య ఉన్న వారు భోజనం చేశాక 2 గంటల తరువాత గ్రీన్ టీ తాగాలి. లేదంటే శరరీం ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాగే నిద్రపోయే ముందు కూడా గ్రీన్ టీ తాగరాదు. గ్రీన్ టీ వల్ల నిద్ర అస్తవ్యస్తమవుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. అందుకని రాత్రి పూట గ్రీన్ టీ తాగరాదు. రోజుకు 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీని తాగవచ్చు. అంతకు మించి తాగితే శరీరం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. దీని వల్ల పోషకాహార లోప సమస్య వస్తుంది. కనుక గ్రీన్ టీని పైన సూచించిన సమయాల్లో తాగితేనే మంచిది.

5442

More News

VIRAL NEWS

Featured Articles