అధిక బ‌రువు త‌గ్గాలా..? వీటిని రోజూ తినండి..!


Thu,September 21, 2017 08:57 AM

అధిక బ‌రువుతో నానా అవ‌స్థ‌లు ప‌డుతూ రోజూ వ్యాయామం చేయ‌డం, తిండి త‌గ్గించ‌డం వంటి ప‌ద్ధ‌తుల‌ను చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కోసారి ఆహారం విష‌యంలో క‌ఠిన నియ‌మాల‌ను పాటిస్తున్నారు. అయితే దీనికితోడు కింద ఇచ్చిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను కూడా నిత్యం తింటుంటే దాంతో ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట కూడా క‌రిగిపోతుంది. మ‌రి ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

బాదం ప‌ప్పు


బాదం ప‌ప్పులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే విట‌మిన్ ఇ అధిక బ‌రువును త‌గ్గించేందుకు ప‌నికొస్తుంది. నిత్యం గుప్పెడు బాదం ప‌ప్పును నీటిలో నాన‌బెట్టి తింటే ఫ‌లితం ఉంటుంది.

చిరుధాన్యాలు


శరీరంలో కొవ్వును వేగవంతంగా కరిగించడంలో చిరుధాన్యాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగులు, స‌జ్జ‌లు, జొన్న‌లు వంటివి ఈ కోవ‌కు చెందుతాయి.

కొబ్బరి నూనె


కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించ‌డంలో శక్తివంతంగా పని చేస్తుంది. దీంట్లో ఉండే పోషకాలు శ‌రీర‌ జీవక్రియను పెంచుతాయి. శక్తి వినియోగాన్ని రెట్టింపు చేస్తాయి. కాబ‌ట్టి బరువు తగ్గించుకోవాలనుకునే వారు తినే ఆహార పదార్థాల తయారీలో కొబ్బరి నూనె వాడడం చాలా మంచిది.

మిరియాలు


మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగించే సామర్థ్యం మిరియాల‌కు ఉంది. మిరియాలలో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనాలు, ఆక్సిడేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగిస్తాయి. అంతేకాకుండా, జీవక్రియను పెంచటం ద్వారా క్యాల‌రీలు ఖర్చు అయ్యేలా చేస్తాయి.

ద్రాక్షపండ్లు


కొవ్వు కరిగించే అద్భుత ఆహార పదార్థంగా ద్రాక్షపండ్లని చెప్పవచ్చు. ఇవి జీవక్రియ‌ను పెంచి శరీరంలో అదనంగా ఉండే కొవ్వు పదార్థాల‌ను కరిగేలా చేస్తాయి. అంతేకాకుండా, ఈ పండ్లు ఫైబర్ (పీచు)ను కలిగి ఉండి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉండేలా చేస్తాయి. వ్యాయామం చేయ‌డంతో పాటు వీటిని తింటుంటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

6199

More News

VIRAL NEWS