హైదరాబాద్, జూన్ 6: తల్లి పాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం, అంతేకాదు బిడ్డకు పాలివ్వడం వల్ల కూడా తల్లికి చాలా ప్రయోజనాలున్నాయి. తల్లి పాలలో బిడ్డకు కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇలా పాలివ్వడం వల్ల పిల్లలకు మాత్రమే కాదు తల్లికి కూడా ఎంతో మేలు జరుగుతుందట. కొంతమంది అందం పోతుందని పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇష్టపడరు. ఇలా పిల్లలకు తల్లి పాలు అందకపోతే వాళ్లకు రోగనిరోధక శక్తి తగ్గి పిల్లలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
తల్లిపాల వల్ల బిడ్డకు జలుబు, ఇన్ఫెక్షన్స్, మలబద్దకం వంటివి రావు . ఆ సమయంలో తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ కాన్సర్, అండాశయ కాన్సర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. పాలిచ్చే సమయంలో విడుదల అయ్యే హార్మోన్ల వల్ల గర్భాశయం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తల్లిపాలు తాగని పిల్లలు ఊబకాయంతోపాటు పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. తల్లి పాల వల్ల శిశువుకు తగినంత క్యాల్షియం అందుతుంది. ఉబ్బసం, అలెర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె సమస్యలు, కంటి సమస్యలు, డయాబెటిస్ వంటి వాటిని నివారిస్తుంది.