శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 06, 2020 , 18:59:48

నిమ్మతో ఎన్నిలాభాలో..!

నిమ్మతో ఎన్నిలాభాలో..!

హైద‌రాబాద్‌: ‌నిమ్మ‌కాయ‌. సిట్ర‌స్ జాతికి చెందిన ఈ నిమ్మ‌కాయ‌తో మాన‌వాళికి ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడ‌టంతోపాటు, అందాన్ని ఇనుమ‌డింప‌జేసే ల‌క్ష‌ణాలు కూడా నిమ్మ‌లో ఉన్నాయి. సీజ‌న‌ల్‌ రోగాలు ధ‌రిచేర‌కుండా శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఎండ‌కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించ‌డానికి తోడ్ప‌డుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు నిమ్మ‌తో ఉన్నాయి. మరి ఆ ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకుందామా..! 

 నిమ్మతో ప్రయోజనాలు 

  •  నిమ్మర‌సం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. 
  •  నిమ్మలో కావాల్సినంత‌ సి విటమిన్ ల‌భిస్తుంది.
  •  త‌ర‌చూ నిమ్మ‌ర‌సం తీసుకునే వారిలో వ‌య‌సు పెరుగుతున్నా చ‌ర్మం అంత త్వ‌ర‌గా ముడుత‌లు ప‌డ‌దు. దీంతో వృద్ధాప్య చాయ‌లు త్వ‌ర‌గా ద‌రిచేర‌వు. 
  •  ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వ‌స్తుంది. 
  •  పంటినొప్పిని తగ్గించ‌డంలో నిమ్మ‌ర‌సం తోడ్ప‌డుతుంది. చిగుళ్లలోంచి ర‌క్తం వ‌చ్చేవారు త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. 
  •  మ‌న‌ కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొల‌గించి, శుద్ధి చేయ‌డంలో నిమ్మ‌కాయ నిమ్మ‌రసం మంచి ఉప‌కారిగా ప‌నిచేస్తుంది.  
  •  వేసవిలో నిమ్మ‌ర‌సం తాగితే అల‌స‌ట నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
  •  స్థూల కాయం ఉన్న‌వారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్ర‌యోజనం ఉంటుంది.  
  •  నిమ్మ‌లోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించ‌డంలో తోడ్ప‌డుతుంది. 


logo