నారింజ‌, నిమ్మ పండ్ల తొక్క‌ల‌తో చ‌ర్మ సౌంద‌ర్యం


Mon,November 19, 2018 10:45 AM

చాలా మంది నారింజ‌, నిమ్మ పండ్ల‌ను తిని వాటిపై ఉండే తొక్క‌ను ప‌డేస్తుంటారు. కానీ నిజానికి ఆయా పండ్ల తొక్క‌ల‌తోనూ మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. నారిజం, నిమ్మ పండ్ల తొక్క‌ల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న చ‌ర్మానికి సంర‌క్ష‌ణ‌ను ఇస్తాయి. వాటిల్లో ఉండే విట‌మిన్ సి చ‌ర్మాన్ని కాపాడుతుంది. నారింజ‌, నిమ్మ పండ్ల తొక్క‌ల‌ను ఎండ‌బెట్టి పొడి చేసుకుని ఆ పొడిని ఉప‌యోగించ‌వ‌చ్చు.

* ఒక టీ స్పూను తొక్కల పొడి, కొద్దిగా పెరుగు, నీరు కలిపి ముద్దలా చేసుకొని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో కడిగితే చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి మిల మిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

* ఈ పొడికి కొంచెం పెసర పిండి, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే.. మృదువైన, మచ్చలు లేని చర్మం మీ సొంతమ‌వుతుంది.

* ఈ పొడిని పసుపుతో కలిపి ఉపయోగించుకుంటే మొటిమలు, నల్లని మచ్చలు, చర్మం ముడతలు ప‌డ‌డం త‌గ్గుతాయి.

1092

More News

VIRAL NEWS

Featured Articles