చలికాలంలో మెంతి ఆకులు చేసే మేలు మరువకండి..!

పాలకూర, తోటకూర.. తదితర ఆకుకూరల్లాగే మెంతికూరను కూడా చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. మెంతి ఆకులను పలు కూరల్లో కూడా వేసుకుంటుంటారు. అయితే ఇతర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
-చలికాలంలో చెమట పట్టేలా వ్యాయామం చేయాలంటే అందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే మెంతి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వ్యాయామం త్వరగా పూర్తి చేయవచ్చు. అలాగే చలికాలంలో బరువు తగ్గాలనుకునే వారు త్వరగా బరువు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.
-మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
-డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం సహజంగానే కొంత కష్టతరమవుతుంది. అలాంటప్పుడు మెంతి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
-చలికాలంలో జీర్ణ సమస్యలు కూడా సహజంగానే వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
తాజావార్తలు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
- నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్.. వీడియో వైరల్