ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Apr 11, 2020 , 17:58:17

అరటి పండు తొక్కలతో కలిగే అద్భుతమైన లాభాలు..!

అరటి పండు తొక్కలతో కలిగే అద్భుతమైన లాభాలు..!

అరటి పళ్లను తిన్న తర్వాత తొక్కలను పారేయకండి. మనలో చాలా మంది అరటిపండ్లను తిని వాటి తొక్కలను పారేస్తుంటారు. అయితే నిజానికి అరటి పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటి వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుగాయో, వాటి తొక్క వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే మనకు అరటి పండు తొక్క ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అరటి పండు తొక్కలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అలాగే ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు కూడా అరటి పండు తొక్కలో ఉంటాయి. దీంతోపాటు మూడ్‌ను మార్చి డిప్రెషన్‌ను తగ్గించే సెరొటోనిన్ అనబడే సమ్మేళనం కూడా అరటి పండు తొక్కలో ఉంటుంది. అందుకనే ఆ తొక్కను తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

2. కాలినగాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే ఆయా గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

3. అరటిపండు తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఆ తొక్కలను ముఖానికి మర్దనా చేసినట్లు రాస్తే మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుంది.

4. అరటిపండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయి.

5. నీటిలో ఉండే లోహాలను, ఇతర విషపదార్థాలను తొలగించడంలోనూ అరటి పండు తొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో అరటి పండు తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది.


logo