శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Apr 25, 2020 , 20:08:42

అవ‌కాడో పండు ఆరోగ్యానికి ఎంతో మేలు

అవ‌కాడో పండు ఆరోగ్యానికి ఎంతో మేలు

అవ‌కాడో పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని వెన్న పండు అంటారు. వెన్న పండులో అధిక శాతం క్రొవ్వు ఉంటుంది. అందుచేత వెన్న పండు గుజ్జును హోటళ్లలో చికెన్, ఫిష్, మటన్ కూరల్లో, సాండ్ విచ్చెస్, సలాడ్లలోను ఉపయోగిస్తారు. వెన్న దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు గుజ్జుని తినిపించవచ్చు. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, వియత్నాం, దక్షిణ భారత దేశాల్లో ఐస్ క్రీములలోను, డెస్సర్ట్స్ లోను వాడుతారు. వెన్న పండు గుజ్జును పంచదార కలిపిన పాలలో లేదా పంచదార కలిపిన నీరులో కలిపి జ్యూస్ గా తీసేకోవచ్చు. వెన్న పండు గుజ్జు ఎల్ డి ఎల్ (చెడు)కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్ డి ఎల్ (మంచి)కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కేన్సర్,, మధుమేహం, హైపర్ టెన్షన్ లను అదుపు చేసే లక్షణం కూడా వెన్న పండుకు ఉంది. అవకాడో అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది రక్త పీడనం సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడొలు ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటాయి. దీనిలోప‌ల ఉన్న విత్త‌నం కూడా చాలా ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతాయి. అవకాడో పండు విత్తుల వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం

- అవ‌కాడో విత్త‌నంతో రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డి త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాన్స‌ర్‌కు విరుద్ధంగా పోరాడుతుంది. 

- శాండివిచ్‌కు గార్నిష్ చేసుకోవ‌డానికి అవ‌కాడో ఉత్త‌మం. ఇది కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది.

- పాలు, బాదం పాలు లాంటి పానీయాల‌లో అవ‌కాడో విత్త‌నాన్ని ఉప‌యోగిస్తే రుచి చేకూరుతుంది. శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా కాప‌డుతుంది.

- ఈ విత్త‌నాన్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి స‌లాడ్‌లో వాడుకోవ‌చ్చు.

- అవ‌కాడో పండులో క‌న్నా విత్త‌నంలోనే యాంటీఆక్సైడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

- చికెన్‌లో క‌న్నా ఫినాలిక్ కంటెంట్ అవ‌కాడో విత్త‌నంలో ఎక్కువ‌గా ఉంటుంది.

- విత్త‌నం మీద ఉన్న పొర‌ను తొలిగించాలి. త‌ర్వాత ఆ విత్త‌నాన్ని తురిమి గార్నిష్‌గా వాడొచ్చుజ‌

- విత్త‌నాన్ని ఎండ‌బెట్టి మిక్సీ పెట్టించాలి. కాఫీ బీన్స్ బ‌దులు ఈ పొడిని వేసుకొని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పౌడ‌ర్‌ను సూప్‌లో కూడా వేసుకొని తాగొచ్చు.

- ఇలానే కాకుండా అవ‌కాడో పొడిని నీటిలో క‌లిపి వేడి చేసి తాగితే ఆరోగ్యంగా ఉంటారు.

- ఈ పొడిని పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకుంటే  అందంగా త‌యార‌వుతారు. బ‌రువు త‌గ్గ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

- బ్యాక్టీరియా, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌ల‌ను విరుద్ధంగా పోరాడుతుంది. బ్రైన్ ట్యూమ‌ర్ నుంచి కాపాడుతుంది.

- శ‌రీర నొప్పులు, మంట‌లు వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది. 


logo