వంటింట్లో అందాన్ని రెట్టింపు చేసే పదార్థాలు


Mon,October 1, 2018 08:18 PM

అందుబాటులో లేని ఖరీదైన సౌందర్య సాధనాల కోసం వెతికే బదులు..అందుబాటులో ఉండే వంటింటి పదార్థాలు అందాన్ని రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా! ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడే పాలతో మెరిసే చర్మం కోసం ఇలా చేయండి.

* పాలల్లో శనగపిండి, పసుపు, తేనె సమపాళ్లుగా వేసి మిశ్రమంలా కలుపండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ చర్మానికి నలుగులా పెట్టుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
* చర్మం గరుకుగా అనిపిస్తే..రెండు చెంచాల పాలపొడి, ఒక చెంచా నిమ్మరసం, తేనె కలిపి మెత్తని మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి, అరగంట తర్వాత కడిగేస్తే.. చర్మం పట్టులా మెరిసిపోతుంది.
* పాలల్లో రెండు స్పూన్ల రోజ్‌వాటర్, ఒక స్పూన్ ఓట్‌వాటర్ కలుపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి, బొప్పాయి గుజ్జూ కలిపి ముఖానికి, మెడ మీద, చేతులకు ఐప్లె చేయాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం నిగనిగలాడుతుంది.
* పలు కారణాల వల్ల చర్మం, జుట్టు సహజత్వాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు పచ్చిపాలను చర్మానికి, జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగితే ఫలితం ఉంటుంది.
* గ్లాసెడు పచ్చిపాలలో కోడిగుడ్డులోని తెల్లసొన, ఒక స్పూన్ ఉసిరి పొడి, మందారపొడి వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. కురులు ఆకర్షణీయంగా మారుతాయి.

8056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles