ఈ చిట్కాలు పాటిస్తే అందం మీ సొంతం..


Thu,October 4, 2018 07:45 PM

* కొబ్బరినూనెలో కొంచెం నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రామన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు తొలిగి ముఖం తాజాగా మారుతుంది.
* చర్మానికి కొబ్బరినూనె రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత స్నానం చేయాలి. తరుచూ ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
* కీరదోస రసంలో కొంచెం నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 25 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల అలసట తొలిగి ముఖం తాజాగా మారుతుంది.
* పాలు, శనగపిండి, పసుపు బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. తరుచూ ఇలా చేయడం వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది.
* కీరదోస పేస్టు, గుడ్డు సొన, రోజ్ వాటర్ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 25 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ముఖం మీద ముడుతలు తొలిగిపోతాయి.

8172

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles