ఉల్లిగడ్డతో సౌందర్యం మీ సొంతం..


Wed,August 8, 2018 11:02 PM

* ఉల్లిగడ్డల నుంచి రసాన్ని తీయాలి. అందులో ఆలివ్ ఆయిల్‌ను వేసి బాగా కలుపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి ముఖంపై మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మొటిమలు రాకుండా ఉంటాయి.
* ఉల్లిగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్టులా తయారుచేయాలి. దూదిని ఈ పేస్టులో ముంచి శుభ్రపరుచుకొన్న ముఖంపై ముడతలు ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే యవ్వనంగా కనిపిస్తారు.
* ఉల్లిగడ్డరసం తీసి అందులో పెరుగు, కొన్ని చుక్కల లావెండర్ నూనెను వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్లతో ముఖంపై మృదువుగా మర్దన చేయాలి. తరుచూ ఇలా చేస్తే ముఖంపై నల్ల మచ్చలు మాయమైపోతాయి.
* ఉల్లిరసం, శనగపిండి, పచ్చిపాలను బాగా కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

3108
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles