పెరుగుతో అందం మీ సొంతం..!


Mon,July 30, 2018 08:18 PM

ముఖంపై ఉండే మొటిమలు బాధిస్తాయి. అవి తగ్గాక కూడా మచ్చలు మనల్ని వేధిస్తుంటాయి. మచ్చలను తొలిగించి అందాన్ని పెంచడంలో పెరుగు ప్రముఖ పాత్ర వహిస్తుంది.
* పెరుగు, తేనె రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తే మొటిమల తాలూకు మచ్చలను తొలిగిస్తుంది.
* కోడిగుడ్డులోని తెల్లసొనని వేరు చేసి గిలక్కొట్టి మృదువుగా చేయాలి. తెల్లసొనలో పెరుగు వేసి రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* ఓట్‌మీల్‌ను పొడిగా చేసి దానిలో పెరుగు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఆరిన తరువాత మాయిశ్చరైజర్‌ను రాసుకొంటే మొటిమలు తొలిగిపోతాయి.
* పెరుగుని తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పది నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తే మొటిమల నుంచి విముక్తి ్తపొందవచ్చు.

5604
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles