ఈ ఐదు చిట్కాలతో అందం మీసొంతం


Fri,May 18, 2018 08:17 PM

అందం కోసం చాలామంది రకరకాల మేకప్ చిట్కాలను వాడుతుంటారు. చర్మం మీద, ముఖం మీద ప్రయోగాలు చేస్తుంటారు. అయితే..అవన్నీ కాకుండా కేవలం ఐదే.. ఐదు చిట్కాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
* పాలకూరలో విటమిన్ - ఎ, బెటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. చర్మాన్ని సాగకుండా కాపాడుతాయి. అందుకే మీ డైలీ ఫుడ్‌లో పాలకూర ఉండేలా చూసుకోండి.
* టమోటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మ నిగారింపును మెరుగుపరుస్తుంది.
* ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల అందంలో, ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి. ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
* లాక్టిక్ ఆమ్లాలు కావల్సినన్ని లభించే పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. చర్మ సమస్యలను దరిచేరకుండా చూసుకుంటుంది.
* నిమ్మలో విటమిన్ - సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ గుణాలను తగ్గించి, పీహెచ్ లెవల్‌ను పెంచుతాయి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు నిమ్మరసం ముఖానికి ఐప్లె చేస్తే ఫలితం ఉంటుంది.

8185
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles