ఈ చిట్కాలు పాటిస్తే ముఖారవిందం మీసొంతం..


Mon,November 5, 2018 08:21 PM

ఏవేవో క్రిములు రాసి ముఖాన్ని పాడు చేసుకోకుండా.. ఇంట్లో దొరికే వస్తువులతో ముఖవర్ఛస్సును పెంచుకోవచ్చు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
* శీకకాయ గింజలను ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
* ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం పై ముడుతలు మాయమవుతాయి.
* క్యారెట్‌ని చిన్నముక్కలుగా చేసి జ్యూస్ తీయాలి. దీంట్లో చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి.
* గోరింటాకు పొడిలో కొద్దిగా కీరదోస రసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి, మెడకు రాయాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* కరివేపాకు పొడిలో కొద్దిగా వంట సోడా, నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఇలా తరుచుగా చేస్తే ముఖం మీద నల్ల మచ్చలు తొలిగిపోతాయి.

6382

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles