కళ్లు అందంగా కనిపించాలంటే..?


Tue,October 16, 2018 11:10 PM

* దోసకాయ గుజ్జు, రోజ్‌వాటర్ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ నల్లటి వలయాలు పోతాయి.
* రోజ్‌వాటర్, బాదంనూనె బాగా కలుపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి కంటి మీద పెట్టుకోవాలి. 30 నిమిషాల తరువాత దూదిని తొలిగించాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే రక్తసరఫరా జరిగి నల్లటి వలయాలు తొలిగిపోతాయి.
* పాలు, రోజ్‌వాటర్ రెండింటినీ బాగా కలుపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి కంటిమీద 20 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడుగాలి. తరుచూ ఇలా చేస్తే కళ్లు అందంగా కనబడుతాయి.

3406

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles