బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Jun 09, 2020 , 13:39:17

స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలా..? రోజూ పచ్చదనంలో గడపండి..!

స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలా..? రోజూ పచ్చదనంలో గడపండి..!

మద్యపానం, ధూమపానంతోపాటు జంక్‌ఫుడ్ అధికంగా తినడం కూడా ఓ వ్యసనమేనని సైంటిస్టులు ఇది వరకే చెప్పారు. అయితే ఈ అలవాట్లను ఎవరూ అంత త్వరగా మానలేరు. ఎంత వద్దనుకున్నా వాటిని తీసుకుంటూనే ఉంటారు. అయితే అలాంటి వారు నిత్యం పచ్చని ప్రకృతి వాతావరణంలో కొంతసేపు గడిపితే ఆ అలవాట్ల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

నిత్యం మద్యం సేవించేవారు, పొగ అధికంగా తాగేవారు, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినేవారు ఆయా అలవాట్ల నుంచి బయటపడాలంటే.. నిత్యం పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంతసేపు గడిపితే చాలని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు.. నేచురల్ ఎన్విరాన్‌మెంట్స్ అండ్ కార్వింగ్ : ది మెడియేటింగ్ రోల్ ఆఫ్ నెగెటివ్ అఫెక్ట్.. అనే ఓ అధ్యయనంలో సైంటిస్టులు వివరాలను వెల్లడించారు. పచ్చని ప్రకృతిలో నిత్యం గడపడం వల్ల చెడు అలవాట్ల వైపు ఎవరూ ఆకర్షితులు కారని, వాటివైపు చూడడం మానేస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల ఆయా వ్యసనాల నుంచి సులభంగా బయట పడవచ్చని వారు అంటున్నారు. కనుక ఎవరైనా సరే.. నిత్యం కాసేపు పచ్చని ప్రకృతిలో గడిపితే చెడు అలవాట్ల బారి నుంచి తప్పించుకోవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.


logo