శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 21, 2020 , 13:33:10

రామ్‌దేవ్‌ బాబా రూటే సెపరేటు..

రామ్‌దేవ్‌ బాబా రూటే సెపరేటు..

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్నాం. ఇంట్లోనే ఉండి ప్రజలు యోగా చేయడం ఇది మొదటిసారి. ప్రపంచ దేశాల్లో యోగాకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. యోగాను అంతర్జాతీయంగా ప్రాచుర్యం తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృతార్థులయ్యారని చెప్పవచ్చు. 

ఈ సమయంలో పతంజలి బాబా రామ్‌దేవ్‌.. మరోసారి తన రూటే సెపరేటు అని నిరూపించారు. హరిద్వార్లో ముస్లిం మతస్తులతో కలిసి యోగా సాధన చేశారు. యోగాకు మతం లేదని, ఆరోగ్యాన్ని కోరుకొనే వారు ఎవరైనా యోగా సాధన చేయవచ్చునని రామ్‌దేవ్‌ బాబా సూచించారు. యోగా చేయడం వలన ఎన్నో విపరీత వ్యాధులను నయం చేసుకోవచ్చునని, ఆరోగ్యం కోసమే ఈ యోగాసనాలు ఉన్నాయని చెప్పారు. కాగా, గంగోత్రి ఆలయ సముదాయంలో తీర్థ పురోహిత్ ప్రాక్టీస్ చేశారు. రిషికేశ్ పర్మార్త్ ఆశ్రమం సమీపంలో గంగా ఒడ్డున రిషి కుమార్ యోగా చేయగా.. జూఖ అఖారాకు చెందిన ఆచార్య మహమండలేశ్వర్ స్వామి అవధేశానంద్ గిరి మహారాజ్ కంఖల్ లోని హరిహర్ ఆశ్రమంలో యోగా సాధనలో నిమగ్నమయ్యారు.


logo