దగ్గు, జలుబుకు చెక్‌పెట్టే ఆయుర్వేద థెరపీ..!


Sat,December 8, 2018 07:44 PM

చలికాలంలో చాలా మందిని శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. దగ్గు, జలుబు, అలర్జీలు నిరంతరం వస్తుంటాయి. దీంతో అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ వ్యాధుల నుంచి బయట పడేందుకు ఆయుర్వేదం ఓ థెరపీని సూచిస్తున్నది. అదే.. లంఘన థెరపీ.

లంఘన థెరపీ అంటే ఏమీ లేదు.. రోజూ తినే ఆహారాన్ని కొంత మొత్తం తగ్గించి తినడం అన్నమాట. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి అధికమవుతుంది. ఇక ఈ థెరపీలో భాగంగా రోజులో పూర్తిగా అలసిపోయినప్పుడు లేదా ఆకలి, దప్పిక బాగా అయినప్పుడు మాత్రమే ఆహారాలు, పానీయాలను తీసుకోవాలి. ఇక ఈ సీజన్‌లో మాంసాహారం, స్వీట్లు, ఐస్‌క్రీములు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. లేదా మితంగా తీసుకోవాలి.

అల్లం పౌడర్, పసుపు, నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకులు, కరివేపాకు పొడి అన్నింటినీ కలిపి మిశ్రమంగా చేసి ఆ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని భోజనంలో మొదటి ముద్దగా తినాలి. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలు అలర్జీలు, దగ్గు, జలుబు, వైరల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, ఆవ నూనె, నువ్వుల నూనెలను వంటలకు ఉపయోగిస్తే మంచిది. చలికాలంలో దగ్గు, జలుబు ఉన్నవారు నెయ్యి తీసుకోరాదు. తీసుకుంటే దాంతో కొంత పసుపు కలిపి వాడుకోవాలి. ఈ సూచనలు పాటిస్తే ఈ సీజన్‌లో వచ్చే శ్వాసకోశ సమస్యలను అధిగమించవచ్చు.

8749

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles