గురువారం 09 ఏప్రిల్ 2020
Health - Mar 08, 2020 , 12:13:02

అశ్వగంధతో నిద్రలేమి సమస్యకు చెక్‌..!

అశ్వగంధతో నిద్రలేమి సమస్యకు చెక్‌..!

రోజూ ఒకే సమయానికి నిద్రించకపోవడం, తక్కువగా నిద్రించడం వల్ల నిద్రలేమి వస్తుంటుంది. అలాగే ఒత్తిడి, మెటబాలిజం సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వల్ల కూడా కొందరు సరిగ్గా నిద్రించలేకపోతుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం.. నిద్రలేమికి అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. నిత్యం అశ్వగంధ వాడడం వల్ల నిద్ర సరిగ్గా పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 

అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం 200 నుంచి 400 మిలీగ్రాముల మోతాదులో (దాదాపుగా 2 టీస్పూన్లు) వాడితే శరీరంలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ చక్కగా నిద్ర పడుతుంది. అయితే కేవలం నిద్రలేమి మాత్రమే కాదు, నిత్యం తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవారు, డయాబెటిస్‌, ఒబెసిటీ, క్యాన్సర్‌ వంటి సమస్యలు ఉన్నవారు కూడా నిత్యం అశ్వగంధ చూర్ణాన్ని వాడితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. 


logo