బుధవారం 30 సెప్టెంబర్ 2020
Health - Aug 10, 2020 , 16:11:40

ఇంగువ‌తో ఇన్ని లాభాలా..!

ఇంగువ‌తో ఇన్ని లాభాలా..!

హైద‌రాబాద్‌: ఇంగువ! ఆరోగ్యం కోసం, సువాస‌న కోసం దీన్ని వంట‌ల్లో ఎక్కువ‌గా వాడుతుంటారు. ఇదొక ఘాటైన సుగంధ ద్ర‌వ్యం. పొడిగా, ముద్ద‌గా రెండు ర‌కాలుగా ఇది ల‌భ్య‌మ‌వుతుంది. ప‌ప్పు, ప‌ప్పుచారు, పులిహోర‌తోపాటు వివిధ ర‌కాల‌ తొక్కుళ్లో ఇంగువ‌ను వాడుతారు. ఈ ఇంగువ‌ను వాడ‌టం వ‌ల్ల ఆహారం చెడిపోకుండా ఉండ‌టంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ట. మ‌రి ఆ ఇంగువ చేసే మేలేంటో తెలుసుకుందామా..!

  • ఇంగువ‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డంవ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతుంది. 
  • ఇంగువ పొడిలోని యాంటీ బ‌యాటిక్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు శ్వాస స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తాయి. 
  • మ‌హిళ‌లు బెల్లం మ‌ధ్య‌లో బ‌ఠానీ గింజంత ఇంగువ పెట్టుకుని తింటే నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే పొత్తికడుపు నొప్పి త‌గ్గిపోతుంది. 
  • ఒక కప్పు మ‌రిగించిన నీళ్ల‌లో చిటికెడు ఇంగువ వేసి రోజుకు రెండు మూడుసార్లు తాగితే త‌ల‌నొప్పి మాయ‌మ‌వుతుంది. 
  • పిల్ల‌ల‌కు క‌డుపులో నులి పురుగులు ఉంటే సెన‌గ గింజంత ఇంగువ‌ను వాము, బెల్లంతో క‌లిపి తినిపించాలి. మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. 
  • రోజూ భోజ‌నం చేసేట‌ప్పుడు మొద‌టి ముద్ద‌ను నెయ్యి, వాము, ఇంగువ‌ను క‌లిపి తీసుకుంటే అజీర్తి స‌మ‌స్య‌లు తీరిపోతాయి. 
  • అయితే ఇంగువ‌ను ప‌రిమితంగా వాడితేనే మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. అతిగా తీసుకుంటే విరేచ‌నాలు అయ్యే ప్ర‌మాదం ఉంది.     


logo