చక్కెర ఎక్కువగా వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని కొందరు.. డయాబెటిస్ ఉన్నవారు.. ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను ఎక్కువగా వాడుతుంటారు. ఇక బరువు తగ్గాలనుకునేవారు కూడా చక్కెరకు బదులుగా ఆ స్వీటెనర్స్ను వాడుతుంటారు. అయితే నిజానికి సదరు స్వీటెనర్స్ను ఆరోగ్యకర ప్రయోజనాల కోసం వాడడం అనవసరమని, వాటితో పెద్ద ఉపయోగమేమీ ఉండదని, చక్కెరను విడిచిపెట్టి స్వీటెనర్లను వాడితే పెద్ద లాభాలేమీ కలగవని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ది బీఎంజేలో ప్రచురించబడిన అధ్యయనాలను పరిశీలించిన పిమ్మట సైంటిస్టులు ఈ విషయాన్ని తేల్చారు.
చక్కెరకు బదులుగా స్వీటెనర్లను వాడడం వల్ల పెద్ద ప్రయోజనాలేవీ కలగవని, కాకపోతే పెద్దల్లో బాడీ మాస్ ఇండెక్స్ తగ్గగా, పిల్లల్లో పెరిగిందని, అలాగే పెద్దల్లో డయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ గ్లూకోజ్లెవల్స్ తగ్గాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాకపోతే చాలా తక్కువ అధ్యయనాల్లో మాత్రమే ఈ విషయం తెలిసిందని, దీనిపై మరింత విశ్లేషణ జరగాలని అంటున్నారు. ఈ క్రమంలోనే చక్కెరను విడిచిపెట్టి ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను వాడినా అంతగా ఉపయోగడం ఉండదని సైంటిస్టులు నిర్దారించారు.