ఇవి అలవాటు చేసుకుంటే.. ఆర్తరైటిస్, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టేయొచ్చు!
వయసుతోపాటు వచ్చే సమస్యల్లో ప్రధానమైనవి.. ఆర్తరైటిస్ ( Arthritis ), కీళ్ల నొప్పులు ( Joint pains ). శరీరంలోని అధిక వేడి ఈ సమస్యకు ముఖ్య కారణమని అంటారు. ఆహార విధానంలో మార్పులతో ఈ రుగ్మతలు కొంతమేర నియంత్రణలోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి బొప్పాయి: సాధారణంగానే పచ్చి బొప్పాయిలో పపెయిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది. అది కీళ్ల నొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఆర్తరైటిస్తో బాధపడే వాళ్లు పచ్చి బొప్పాయిని తరచూ తీసుకోవాలి. పరగడుపున బొప్పాయి పండు తిన్నా ఉపశమనం లభిస్తుంది.
తెల్ల నువ్వులు: ఇందులోని క్యాల్షియం, కాపర్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అధిక క్యాల్షియాన్ని అందించడంలో తెల్ల నువ్వులదే అగ్రస్థానం.
నానబెట్టిన అంజీరా: ఎండిన అంజీరాలో ఫైటోకెమికల్స్, పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి అప్పటికే ఇబ్బంది పెడుతున్న ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, కొత్త సమస్య రాకుండా చేస్తాయి. నేరుగా ఎండిన అంజీరా కాకుండా, వాటిని నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది.
చియా గింజలు: ఈ గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను నియంత్రిస్తాయి. రుమటాయిడ్ ఆర్తరైటిస్తో బాధపడేవారు ఈ గింజలను రోజూ నీళ్లలో నానబెట్టుకుని తాగాలి.
మెంతులు: వీటిలోని లినోలెనిక్, లినోలిక్ ఆమ్లాలు కీళ్లనొప్పిని తగ్గిస్తాయి. ఒక టీస్పూన్ మెంతులను కప్పు నీళ్లలో బాగా మరిగించి, ఆ తర్వాత వడగట్టి తాగితే గుణం కనిపిస్తుంది.