మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Aug 17, 2020 , 19:45:06

ఎక్కువ స‌మ‌యం కూర్చునే ప‌నిచేస్తున్నారా? అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌ట్లే!

ఎక్కువ స‌మ‌యం కూర్చునే ప‌నిచేస్తున్నారా? అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌ట్లే!

ఈ రోజుల్లో ఎక్కువ‌గా కూర్చుని ప‌నిచేసేవాళ్లే ఎక్కువ‌. న‌డిచేదానిక‌న్నా కూర్చోవ‌డ‌మే ఎక్కువ‌గా ఉంటుంది. దీనివ‌ల్ల లేనిపోని స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. అయితే కార్యాల‌యాల్లో ప‌నిచేసేవాళ్లు రోజుకి 8 గంట‌లు ప‌నిచేయ‌డం కామ‌న్‌. కానీ అంత‌కు మించి ప‌నిచేయ‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం అనే ముప్పు వాటిల్లుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొంద‌రు ప‌నిచేసే స‌మ‌యాల‌ను బ‌ట్టి ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న జ‌రిపారు. అంటే వారానికి 53 నుంచి 83 గంట‌లు ప‌నిచేసేవారిలోనే ఈ స‌మ‌స్య ఉంటుంద‌ని గుర్తించారు. ఈ వ్యాధి వెంట‌నే త‌గ్గిపోకుండా కొన‌సాగుతూ ఉంటే మిగ‌తా స‌మ‌స్య‌ల‌తోపాటు మ‌ధుమేహానికి దారితీస్తుంది. కాబ‌ట్టి ప‌ని ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు త్వ‌ర‌గా కంప్లీట్ చేసుకోవ‌డ‌మో లేదంటే మ‌ధ్య మ‌ధ్య‌లో రిలాక్స్ అవుతూ ఉంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. 


logo