కీటో డైట్‌లో ఉన్నారా..? ఈ ఫ్యాట్స్‌ను మరువకండి..!


Thu,June 28, 2018 09:50 AM

నేటి తరుణంలో ఎవరి నోట విన్నా కీటో డైట్ అనే పదం బాగా వినిపిస్తున్నది. చాలా మంది ఇప్పటికే ఈ డైట్‌ను పాటిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. అధిక బరువు, థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులకు కీటో డైట్ అమోఘంగా పనిచేస్తుందని పలువురు వైద్య నిపుణులు కూడా చెబుతుండడంతో అనేక మంది ఈ డైట్‌ను ప్రస్తుతం అనుసరిస్తున్నారు. అయితే కీటో డైట్‌లో ప్రధానంగా కొవ్వులకే ప్రాధాన్యత ఉంటుందని అందరికీ తెలుసు. అందులో పిండి పదార్థాలను చాలా అత్యల్పంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొవ్వుల విషయానికి వస్తే కీటో డైట్‌ను పాటించే వారు ఈ కొవ్వులను తీసుకుంటే డైట్ నుంచి మంచి ఫలితం రాబట్టవచ్చు. మరి ఆ కొవ్వులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కీటో డైట్‌లో ఉన్నవారు చేపలను కచ్చితంగా తినాలి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. కనుక కీటోడైట్ పాటించే వారు చేపలను తరచూ తినాలి. దీని వల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. దీంతో బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

2. కీటోడైట్‌లో ఉన్నవారు కోడిగుడ్డు పచ్చసొనను కూడా కచ్చితంగా తీసుకోవాలి. అందులోనూ మన శరీరానికి పనికొచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి బరువు తగ్గించేందుకు, శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, ఎముకల దృఢత్వానికి పనికొస్తాయి. కనుక కోడిగుడ్డు పచ్చసొనను కచ్చితంగా తినాల్సి ఉంటుంది.

3. చియా విత్తనాలు
చియా విత్తనాల్లో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. కీటోడైట్‌లో ఉన్నవారు ఈ విత్తనాలను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. బరువు త్వరగా తగ్గవచ్చు. దీనికి తోడు శరీరానికి పోషణ కూడా అందుతుంది.

4. ఆలివ్ ఆయిల్
మన శరీరానికి పనికొచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు ఆలివ్ ఆయిల్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌ను కీటో డైట్‌లో ఉన్నవారు తీసుకుంటే ఎంతగానో మేలు చేస్తుంది. కూరలపై ఆలివ్ ఆయిల్‌ను చల్లుకుని తింటే ఆశించిన ఫలితం వస్తుంది. గుండె జబ్బులను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.

5. బాదం పప్పు, పిస్తాలు, వాల్ నట్స్‌ను కీటోడైట్‌లో ఉన్నవారు తీసుకోవాలి. వీటిల్లో ఉండే ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ మనకు మేలు చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. అధిక బరువును తగ్గించి శరీరానికి పోషణను అందిస్తాయి.

2220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles