గుండెజబ్బులపై డా.ఫెరీద్ మురాద్‌తో ‘అపోలో’ భాగస్వామ్యం

Tue,December 10, 2019 07:28 AM

హైదరాబాద్: భారతీయుల్లో గుండెజబ్బులు అధికంగా రావడానికి గల కారణాలతో పాటు ముందస్తుగా గుండె సమస్యలను గుర్తించే మార్గాలను అన్వేషించడానికి ‘నోబెల్ బహుమతి గ్రహీత డా. ఫెరీద్ మురాద్‌’తో కలిసి పనిచేయనున్నామని అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీతారెడ్డి ప్రకటించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆపోలో దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో డా.ఫెరీద్ మురాద్‌తో కలిసి సంగీతారెడ్డి మాట్లాడుతూ.. గత కొన్నేండ్లుగా భారత్‌లో గుండెజబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీనికి గల కారణాలను అన్వేషించేందుకు డా.ఫెరీద్ మురాద్ చేస్తున్న పరిశోధనల్లో అపోలో సిబ్బందిని భాగస్వామం చేసుకుంటుందన్నారు. ఈ పరిశోధనలతో కచ్చితమైన కారణాలతో పాటు చికిత్సలో మరింత సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అపోలో సీనియర్ కార్డియాలజిస్ట్ డా.మనోజ్ అగర్వాల్, సీఈవో వై.సుబ్రమణ్యం, డైరెక్టర్ డా.సి.వెంకట్ ఎస్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

1109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles