శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 17, 2020 , 18:00:39

వైద్య పరికాలకూ యాంటీబయాటిక్స్‌

వైద్య పరికాలకూ యాంటీబయాటిక్స్‌

అదేంటీ?.. పరికాలకు యాంటీబయాటిక్స్‌ ఏంటీ అనుకుంటున్నారా?.. మీరు చదివింది కరక్టే.  మనిషికి ఇన్‌ఫెక్షన్‌ వస్తే యాంటిబయాటిక్‌ వేస్కుంటాం. కాని ఇటీవలి కాలంలో హాస్పిటల్‌లో ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రావడం ఎక్కువగా కనిపిస్తోంది. చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళ్తేత కొన్నిసార్లు ఉన్న వ్యాధికి సంబంధంలేని కొత్త వ్యాధులు వెంటబడుతూ ఉంటాయి. హాస్పిటల్‌ వాతావరణంలో వచ్చే  ఇన్‌ఫెక్షన్ల వల్లనే ఇటువంటి కొత్త సమస్యలు తలెత్తుతాయి. సర్జరీలు చేయించుకున్నవాళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. శస్త్రచికిత్సలో ఉపయోగించే పరికరాల మీద ఉండే బాక్టీరియాయేయే ఇందుకు కారణమవుతాయి. అందుకే హాస్పిటల్‌లో వాడే వివిధ రకాల వైద్య పరికరాలకు కూడా యాంటి బయాటిక్స్‌ వాడాలంటున్నారు పరిశోధకులు. హాస్పిటల్‌ ఇన్‌ఫెక్షన్లను నిరోధించడానికి ఈ పరికరాలకు యాంటి బయాటిక్‌ పూత వేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు మిసిసిపి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇలా ఆధునీకరించిన వైద్య పరికరాల పైన శక్తివంతమైన పెన్సిలిన్‌ యాంటి బయాటిక్‌ పూత వేసినప్పుడు అది తొలగిపోకుండా ఉంటుది. కాబట్టి వీటిని రోగులకు ఉపయోగించినా వాళ్లకు ఇన్‌ఫెక్షన్లు రావు. అయితే ఇలాంటి విధానం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. 


logo