గురువారం 04 జూన్ 2020
Health - Mar 31, 2020 , 18:32:02

కరోనా టైం.. జ‌లుబు, ద‌గ్గు రాకుండా ఏం చేయాలి?

కరోనా టైం.. జ‌లుబు, ద‌గ్గు రాకుండా ఏం చేయాలి?

క్వారెంటైన్ స‌మ‌యంలో బ‌య‌ట నుంచి వ‌చ్చే స‌మ‌స్య‌లు ఏమో గాని జ‌లుబు, ద‌గ్గు రాకుండా చూసుకోవాలి. సాధార‌ణంగా వ‌చ్చినా ఎంత‌టి ప‌రిణామాల‌కు దారితీస్తుందో తెలియ‌దు. అందుకే జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంద‌ని సిగ్న‌ల్ రాగానే ఈ రెసిపీతో వాటిని త‌రిమికొట్టండి. క‌రోనాను ద‌రిచేర‌కుండా చూడండి.ఒక‌ప్పుడు జ‌లుబు వ‌చ్చిందంటే పోనీలో చాలా రోజుల త‌ర్వాత వ‌చ్చింది. లోప‌ల ఉన్న దుమ్ము, ధూళీ అంతా దీని ద్వ‌రా అయినా పోతుంది అని అనుకుని వ‌దిలేసేవారు. ఇప్పుడు సిచువేష‌న్ మారింది. అస‌లే క‌రోనా. దీనికి ముఖ్య ల‌క్ష‌ణాలు జ‌లుబు, ద‌గ్గు ఆ త‌ర్వాత జ్వ‌రం. ఈ జ‌లుబు, ద‌గ్గు సాధార‌ణంగా వ‌చ్చినా వ‌దిలేయాల్సిన ప‌రిస్థితి కాదు. అందుకే వెంట‌నే ఈ రోగాలు రాకుండా ముందే జాగ్రత్త వహిస్తే మంచిది. ముఖ్యంగా చ‌ల్ల‌ని నీరు తాగ‌కూడ‌దు. డ‌స్ట ఎల‌ర్జీ ఉన్న‌వారు ఇంట్లో బూజు, దుమ్ము దుల‌ప‌టం వంటి ప‌నులు మానుకోండి. శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌ను త‌గ్గించే ఆహార ప‌దార్థాల‌ను ప‌క్క‌న పెట్ట‌డం మంచిది. ఈ రెసిపీతో చిన్న‌చిన్న‌రోగాల‌ను చెక్ పెట్టండి.

రెసిపీ త‌యారీ 

కావాల్సిన ప‌దార్థాలు :  ఆలివ్ ఆయిల్‌, తేనె, తురిమిని బెల్లం, నిమ్మ‌కాయ‌


త‌యారీ :

ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్‌, తేనెచ బెల్లం, నిమ్మ‌కాయ ర‌సాన్ని స‌మానంగా తీసుకోవాలి. వీట‌న్నింటినీ బాగా క‌లుపాలి. కొంచెం కొంచెం చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. ఇలా రెండురోజులు స‌రిగా పాటిస్తే చాలు జులుబు, ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.


logo