సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Aug 12, 2020 , 15:35:40

కరోనా వైరస్ కు ఇది మరో లక్షణం

కరోనా వైరస్ కు ఇది మరో లక్షణం

చికాగో : గత కొన్నాళ్లుగా ప్రపంచ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా వైరస్ కట్టిడికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ మార్గం దొరికింది. తొలిరోజుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించేవి. ఆ తర్వాతి రోజుల్లో కండ్లు ఎర్రగా కావడం కూడా ఒక లక్షణంగా నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కిళ్లు రావడం కూడా కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి కారణమంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చికాగోకు చెందిన ఓ 62 ఏండ్ల వ్యక్తి నాలుగు రోజులుగా ఎక్కిళ్ళు ఎదుర్కొన్నాడు. అతడిలో కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి మరే ఇతర లక్షణాలు కనిపించలేదు. జ్వరం వచ్చిన తరువాత అతడ్ని చెకప్ కోసం దవాఖానకు తీసుకువచ్చారు. వరుసగా 48 గంటలు ఎక్కిళ్ళు ఆగిపోకపోయే సరికి కరోనాను పరీక్షలు జరుపగా పాజిటివ్ గా తేలింది. ఇలాగే వరుసగా నాలుగు రోజులపాటు ఎక్కిళ్లు ఆగిపోకపోతే కరోనాగా అనుమానించి వైద్యుడిని సంప్రదించాలని అమెరికన్ నిపుణులు సూచిస్తున్నారు.

ఊపిరితిత్తుల జర్నల్ ప్రకారం.. రోగికి ఎక్కిళ్ళు తప్ప జ్వరం మాత్రమే ఉంది. సదరు మనిషి ఇంతకు ముందు ఏ వ్యాధితో బాధపడలేదు. కానీ, చాలా షాకింగ్ విషయం తన నివేదికలో బయటపడింది. అతడి ఊపిరితిత్తులు చెడిపోయి ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో చాలా వాపు వచ్చింది. అతనికి ఊపిరితిత్తుల వ్యాధి లేనప్పటికీ ఒక ఊపిరితిత్తి నుంచి వాపు కనిపించి రక్తస్రావం జరిగింది.

ఊపిరితిత్తుల్లో వాపు ఎక్కిళ్ళకు కారణం

మా వద్దకు వచ్చిన రోగి ఊపిరితిత్తుల్లో కనిపించిన వాపు అతడి ఎక్కిళ్లకు కారణమని తేల్చాం. అతడిని ఎమర్జెన్సీ వార్డులో చేర్చి అజిత్రోమైసిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చాం. మూడు రోజుల అనంతరం అతను దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యాడని చికాగోలో అతడికి వైద్యం అందించిన దవాఖాన కుక్ కంట్రీ హెల్త్ తెలిపింది.

చాలా చలి, జలుబు, కండరాల నొప్పి, నిరంతర తలనొప్పి, గొంతు నొప్పితో వణుకు, వాసన లేదా రుచి తెలియకపోవడం కరోనా లక్షణాలని అమెరికా ప్రభుత్వ అత్యున్నత వైద్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటివి కరోనా ఇన్‌ఫెక్షన్‌ లక్షనాలని తొలుత సీడీసీ చెప్పింది.


logo