ఒక్క ట్యాబ్లెట్‌తో షుగ‌ర్‌, గుండె జ‌బ్బుల‌కు చెక్‌!


Tue,September 5, 2017 01:05 PM

డ‌యాబెటిస్‌, గుండె సంబంధిత‌ జబ్బులు.. రెండూ ప్రాణాంత‌క‌మే. ఈ వ్యాధుల బారిన ప‌డి ఏటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది మృత్య‌వాత ప‌డుతున్నారు. అయితే అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ రెండు ప్రాణాంత‌క వ్యాధుల‌కు ఒక్క మందుతో చెక్ పెట్టొచ్చ‌ని తాజా ప‌రిశోధ‌న‌లు తేల్చాయి. యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన పెరెల్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప‌రిశోధ‌కులు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. జ‌న్యు స‌మాచారాన్ని విపులంగా విశ్లేషించిన త‌ర్వాత ఈ రెండు స‌మ‌స్య‌ల‌కు ఒకే ర‌క‌మైన జ‌న్యువు కార‌ణ‌మ‌ని తేలింది. టైప్ 2 డ‌యాబెటిస్ (టీ2డీ), క‌రోన‌రీ హార్ట్ డిసీజ్ (సీహెచ్‌డీ)ల‌కు ఉన్న లింకు ఏంటో ఈ రీసెర్చ‌ర్లు వివ‌రించారు.

రెండున్న‌ర ల‌క్ష‌ల మంది జ‌న్యు శ్రేణి స‌మాచారాన్ని వీళ్లు ప‌రీక్షించారు. ఇందులో డ‌యాబెటిస్‌కు కొత్తగా 16 జ‌న్యుప‌ర‌మైన కార‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌గా.. గుండె సంబంధిత వ్యాధుల‌కు ఒక కార‌ణం తెలిసింది. దీంతో ఈ రెంటికీ ఉన్న సంబంధం కూడా బ‌య‌ట‌ప‌డింది. డ‌యాబెటిస్ రావ‌డానికి కార‌ణ‌మైన జ‌న్యువులే గుండె సంబంధిత వ్యాధుల‌కూ కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని గుర్తించారు. ఈ రెండు జ‌బ్బుల‌కు కార‌ణ‌మైన ఓ జ‌న్యు ర‌కాన్ని ప‌రిశోధ‌కులు ప‌సిగ‌ట్ట‌గ‌లిగారు. దీంతో భ‌విష్య‌త్తులో ఈ రెండు ప్రాణాంత‌క వ్యాధుల‌కు ఒకే మందు స‌రిపోతుంద‌ని ఈ టీమ్‌లో ఒక‌రైన డానిష్ సాలెహీన్ తెలిపారు. ఈ తాజా ప‌రిశోధ‌న‌లను నేచ‌ర్ జెన‌టిక్స్ జ‌ర్న‌ల్‌లో ప‌బ్లిష్ చేశారు.

8621

More News

VIRAL NEWS