ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - May 18, 2020 , 15:34:38

జీల‌క‌ర్ర వాడండి.. ఆరోగ్యంగా ఉండండి!

జీల‌క‌ర్ర వాడండి.. ఆరోగ్యంగా ఉండండి!

క‌రోనా ప్ర‌భావం ఎక్క‌వ‌వుతున్న త‌రుణంలో ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రోజూ మనం తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసకుంటూనే యోగా, వ్యాయామం చేయాలని చెబుతున్నారు.  దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి 

పెరిగుతుందంటున్నారు.  ఇమ్యూనిటీని పెంచే ఆహారం పదార్థాల్లో వంటింట్లో దొరికే జీలకర్ర ఒకటి.  జీల‌క‌ర్ర వ‌ల్ల ఉప‌యోగాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఉప‌యోగాలు :

- వ్యాధి నిరోధ‌కశ‌క్తిని పెంచుతుంది.

- మ‌హిళ‌ల్లో అప‌స‌వ్య రుతుక్ర‌మాన్ని నివారిస్తుంది.

- నీళ్ల విరోచ‌నాల‌ను త‌గ్గిస్తుంది.

- డ‌యాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుతుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది.

- ఆస్త‌మా వ్యాధిని నివారిస్తుంది.

- శ‌రీరంపై త్వ‌ర‌గా ముడ‌త‌లు రాకుండా చేస్తుంది.

- ఎసిడిటీ, జీర్ణ సంబంధ వ్యాధులు, వికారం, వాంతుల‌కు మంచి ఔష‌ధం.


logo